డ్రైన్‌లో దూసుకుపోయిన కారు
ABN , Publish Date - Jul 30 , 2025 | 12:44 AM
పామర్రు – దిగమర్రు జాతీయ రహదారిలో ముదినేపల్లి సమీ పంలోని పోల్‌రాజ్ మేజర్ డ్రెయిన్‌లోకి మంగళవారం రాత్రి కారు దూసుకుపోయిన ఘటనలో భర్త మర ణించగా భార్య ప్రాణాలతో బయటపడింది.
ముదినేపల్లి, జూలై 29 (ఆంధ్రజ్యోతి): పామర్రు – దిగమర్రు జాతీయ రహదారిలో ముదినేపల్లి సమీ పంలోని పోల్‌రాజ్ మేజర్ డ్రెయిన్‌లోకి మంగళవారం రాత్రి కారు దూసుకుపోయిన ఘటనలో భర్త మర ణించగా భార్య ప్రాణాలతో బయటపడింది. మండవల్లి మండలం లింగాల గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎన్ ఆర్‌ఎస్‌ఏ సైంటిస్ట్ చందు వెంకటేశ్వరరావు తన భార్య రాణితో కలసి హైదరాబాద్ నుంచి కారులో వస్తుండగా ప్రమాదవశాత్తు పోల్‌రాజ్ డ్రైయిన్‌లోకి కారు దూసుకు పోయింది. కారు డ్రైవ్ చేస్తున్న వెంకటేశ్వరరావు మర ణించగా కారులో ఉన్న అతని భార్యను అక్కడ చేపల చెరువులపై పనిచేస్తున్న కొందరు యువకులు డ్రైన్‌లో దిగి కారు అద్దాలు పగుల కొట్టి ఆమెను రక్షించారు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ వీరభద్రరావు సిబ్బందితో ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
అధికార్ల తప్పిదం వల్లే..
ఈ ప్రమాదం జరగటానికి కారణం జాతీయ రహదార్ల అభివృద్ధి సంస్ధ అధికార్లదే తప్పిదమని తెలుస్తోంది. పోల్‌రాజ్ డ్రైన్‌కు ఇరువైపులా రోడ్డు విస్తరణ పనులు చేస్తుండటం, కనీసం డ్రెయిన్ వద్ద రోడ్డు డైవర్షన్ బోర్డు కూడా ఏర్పాటు చేయకపోవడంతో రెండు వైపులా వాహనాలు సరాసరి డ్రైయిన్‌లోకి వెళ్ళిపోయే ప్రమాదకర పరిస్థితి నెలకొంది.