తొలగిన అడ్డంకులు
ABN , Publish Date - Dec 20 , 2025 | 12:26 AM
కాలువల ఆక్రమణలు తొలగించి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టడంతో పంట కాలువలు నీటితో కళకళలాడుతున్నాయి.
15 ఏళ్ల తర్వాత కె.లంక పంట కాలువ ప్రక్షాళన
తూడు, గుర్రపు డెక్క, పూడిక తీత పనులు
ఆయకట్టు రైతుల ఆనందం
కాళ్ల, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పంట కాలువలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు కాలువల ఆక్రమణలు తొలగించి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టడంతో పంట కాలువలు నీటితో కళకళలాడుతున్నాయి. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చొరవతో ఉండి నియోజకవర్గంలో ఇప్పటికే చాలా కాలువలు ప్రక్షాళన చేశారు. ప్రస్తుతం మండలంలో ప్రధాన పంట కాలువల్లో ఒకటైన కె.లంక పంట కాలువ ప్రక్షాళన పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. సుమారు 15 ఏళ్లుగా ఎటువంటి అభివృద్ధికి నోచుకోక ఆక్రమణలకు గురైన గట్లను ప్రక్షాళన చేయడంతోపాటు నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న తూడు, గుర్రపుడెక్క, చెట్లు తొలగించడంతో ఎంతో పరిశుభ్రంగా కనిపిస్తూ చూపరులను ఆకట్టుకుంటుంది. ఉండి ప్రధానపంట కాలువ నుంచి సుమారు 10 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ కాలువ ఆయకట్టు గ్రామాల రైతులు నిన్నా మొన్నటి వరకు సాగు, తాగునీటి కోసం ఇబ్బందులు పడేవారు. పీ4 కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం ప్రభుత్వ నిధులతో ప్రమేయం లేకుండానే కాలువను బాగు చేయిస్తున్నారు.