Share News

జిల్లాపై ఫోకస్‌!

ABN , Publish Date - Dec 12 , 2025 | 12:10 AM

ఏలూరు జిల్లా అభివృద్ధిపై కూటమి ప్రభు త్వం ప్రత్యేక ఫోకస్‌ పెట్టింది. రాష్ట్ర మంత్రి వర్గ ఉప సంఘం సమావేశంలో జిల్లాకు మేలు చేకూర్చడంతో పాటు, ఉద్యోగ, ఉపాధి, విద్యా అవకాశాలను మెరుగపరిచే నిర్ణయాల వైపు సాగుతోంది.

జిల్లాపై ఫోకస్‌!

ఏలూరులో ఎంఐజీ ఇళ్ల ప్లాట్‌లకు లైన్‌క్లియర్‌

నూజివీడులో మ్యాంగో పల్ప్‌ పరిశ్రమకు సబ్సిడీ

గతంలో అంబేడ్కర్‌ వర్సిటీ.. బయోగ్యాస్‌ ప్లాంట్‌

రాష్ట్ర కేబినెట్‌లో కీలక నిర్ణయాలపై జిల్లావాసుల హర్షం

ఏలూరు, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లా అభివృద్ధిపై కూటమి ప్రభు త్వం ప్రత్యేక ఫోకస్‌ పెట్టింది. రాష్ట్ర మంత్రి వర్గ ఉప సంఘం సమావేశంలో జిల్లాకు మేలు చేకూర్చడంతో పాటు, ఉద్యోగ, ఉపాధి, విద్యా అవకాశాలను మెరుగపరిచే నిర్ణయాల వైపు సాగుతోంది. పరిశ్రమలను ఇతోధికంగా స్థాపించేవారికి ప్రోత్సహాకాలను ఇస్తోంది. ప్రతీ నియోజకవర్గానికి పారిశ్రామిక వాడ ను ఏర్పాటు చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఏడు నియోజక వర్గాల్లో ఈ దిశగా యంత్రాంగం సాగుతోంది. తద్వారా అన్ని ప్రాంతాల సమతూకంగా అభివృద్ధి చెందడా నికి ఆస్కారం ఏర్పడుతోంది. కొద్ది నెలలు క్రితం కేబినెట్‌లో ఏలూరుకు అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు వర్సిటీ భవనాలు, ఇతర నిర్మాణా లపై ఇటీవల కదలిక వచ్చింది. ఇదే తరుణంలో నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లిలో వంద ఎకరాల్లో బయోగ్యాస్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. ఇటీవలే ద్వారకాతిరుమల మండలం సీహెచ్‌ పోతేపల్లిలో పామాయిల్‌ రిఫైనరీకి సబ్సిడీ లను ఇచ్చింది. ఇక్కడ 200 మందికి పైబడి ఉపాధి అవకాశాలు మెరుగువుతున్నాయి.

మధ్యతరగతి ఇంటి కల సాకారం

ఏలూరు శివారు శనివారపుపేటలో ఆర్‌ఎస్‌ నెంబర్‌ 2/1, 3/1ల్లో మధ్యతరహా కుటుంబాలు (ఎంఐజీ)కు ఇళ్ల ప్లాట్‌లను వేసి అమ్ముకునే విధంగా ఏలూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అఽథారిటి(ఇడా)కు 36 ఎకరాల 41 సెంట్ల స్థలాన్ని బదిలీ చేస్తూ రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. చాలా కాలం క్రితం ఇక్కడ భూమిని రెవెన్యూశాఖ అధికారులు సర్వే చేసి మధ్యతరహా ప్రజలకు ఇళ్ల నిర్మాణాలకు ప్లాట్లు వేసేలా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఆ స్థలాన్ని ఇడాకు బదిలీ చేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. నగరంలో కలిసిపోయినట్లుగా ఉండే శనివారపుపేటలో చిన్నపాటి ఉద్యోగాలు, ఇతర వృత్తుల్లో స్థిరపడిన వారి సొంతింటి కలకు ప్రభుత్వం మార్గం సుగమం చేసింది.

మామిడి పల్ప్‌కు వరం

మరోవైపు గతనెల 11న ప్రకాశం జిల్లా వర్చువల్‌ విధానంలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నూజివీడులో రామన్‌సింగ్‌ గ్లోబల్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌కు శంకుస్థాపన జరగ్గా, దానికి 30 శాతం సబ్సిడీ ఇచ్చేందుకు మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. ఇక్కడ మ్యాంగో పల్ప్‌ పరిశ్రమను ఈ సంస్థ రూ.141 కోట్ల వ్యయంతో స్థాపించనుంది. తద్వారా స్ధానికంగా 600 మందికి ఉద్యోగాల కల్పనకు ఆ సంస్థ ముందు కొచ్చింది. తాజాగా ఈ సంస్థకు సబ్సిడీలు ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. మామిడి ఎగుమతులు తగ్గుతున్న క్రమంలో మ్యాంగో పల్ప్‌ పరిశ్రమ ద్వారా రైతులకు మెరుగైన ఆదాయం సమకూరనుంది.

Updated Date - Dec 12 , 2025 | 12:10 AM