Share News

ఎక్కడ ఆగింది ?

ABN , Publish Date - Dec 02 , 2025 | 12:45 AM

పశ్చిమ గోదావరికి భీమవరం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (బీవీడీఎం) ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ నాగరాణి గతంలో తణుకు వచ్చిన సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకుని వెళ్లారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు.

ఎక్కడ ఆగింది ?

భీమవరం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు సానుకూలం

పశ్చిమ గోదావరికి భీమవరం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (బీవీడీఎం) ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ నాగరాణి గతంలో తణుకు వచ్చిన సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకుని వెళ్లారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు. వెంటనే మున్సిపల్‌ పరిపాలన శాఖ నుంచి ప్రతిపాదనలు కోరారు. అందుకు తగ్గట్టుగానే రూ.1.19 కోట్లతో కలెక్టర్‌ ప్రతిపాదనలు పంపించారు. అయితే ఇప్పటి వరకు దీనిపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదు. పీఏసీ చైర్మన్‌, ఎమ్మెల్యే అంజిబాబు ఈ విషయాన్ని ప్రభుత్వం వద్ద ప్రస్తావించారు. అయినా ఎటువంటి చలనం లేదు. ఎక్కడ ఆగిందో ? ఎవరు ఆపారో తెలియదు. ప్రస్తుతం జిల్లా ఏలూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీలోనే కొనసాగుతోంది.

తణుకు పర్యటనలో కోరిన నివేదిక

ప్రభుత్వానికి పంపిన జిల్లా కలెక్టర్‌

పెండింగ్‌లోనే ప్రతిపాదనలు

భవన నిర్మాణాల అనుమతికి ఏలూరు వెళ్లాల్సిన పరిస్థితి

భీమవరంలో ఏర్పాటు చేయాలని ప్రజలు, ప్రజా ప్రతినిధుల వినతి

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

తూర్పు గోదావరి జిల్లాలో రెండు అథారిటీ లున్నాయి. పశ్చిమలో మాత్రం ఒక్క దానితో నే కాలం వెళ్లదీస్తోంది. అపార్ట్‌మెంట్‌లు, పరి మితికి మించి భవనాలు నిర్మించాలంటే ఏ లూరు డెవలప్‌మెంట్‌ అథారిటీకి వెళ్లాల్సి వ స్తోంది. ఫీజులన్నీ ఆ ఖాతాలోనే చెల్లిస్తున్నా రు. అందులో 20 శాతం నిధులు అథారిటీ తమ పరిధిలో మౌలిక వసతులు కల్పనకు వెచ్చించుకునే వెసులుబాటు ఉంది. మిగిలిన 80 శాతం ఆయా స్థానిక సంస్థలకు జమ కా వాలి. ఇప్పటి వరకు మున్సిపాలిటీలకు, పం చాయతీలకు సొమ్ములు జమకాలేదు. కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉన్నాయి.

భీమవరం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటుకు ఇక్కడ అన్ని అర్హతలు వున్నాయి. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లోని పట్టణ ప్రాంతాలైన భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, నర్సాపురం మున్సిపాలి టీలతోపాటు, ఆకివీడు నగర పంచాయతీలు ఉన్నాయి. ఇక్కడ పెద్ద నిర్మాణాలు జరుగు తుంటాయి. దీనికితోడు మరో 18 మేజర్‌ పంచాయతీలను స్పెషల్‌ గ్రేడ్‌గా గుర్తించను న్నారు. ఆదాయం, జనాభాల పరంగా అవి పెద్ద పంచాయతీలుగా నిర్ధారించారు. మరో వైపు మండల కేంద్రాల ఆదాయం తక్కువేమీ కాదు. పట్టణ ప్రాంత ఒరవడి మండల కేంద్రాల్లోనూ ఉంది. వీటిని దృష్టిలో ఉంచు కుని భీమవరం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథా రిటీ ప్రత్యేకంగా ఉండాలన్న డిమాండ్‌ ఈ జిల్లాలోనూ వినిపిస్తోంది. అందుకు తగ్గట్టు గానే జిల్లా ప్రజా ప్రతినిధులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పం దించినా, దీనిపై ఎటువంటి కసరత్తు చేయలేదు. వైసీపీ హయాంలో జిల్లాల పునర్విభజన తర్వాత రెండు కొత్త అథారిటీలను ఏర్పాటుచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భీమవరం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ డిమాండ్‌ తెరపైకి వచ్చింది. నిధులు పెద్దగా అవసరం లేదు. ప్రభుత్వ కార్యాలయాలు అందుబాటులో ఉన్నాయి. భీమవరం మున్సిపాలిటీలోనే ఆర్డీవో కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. అథారిటీ ఏర్పాటుకు భవనం సమస్య లేదు. ఉద్యోగులు, సిబ్బంది జీతభత్యాలు, ఇతర నిర్వహణ కోసం రూ. 1.19 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఆది పెద్ద మొత్తమేమీ కాదు. ఆదాయం వస్తుంది. ప్రభుత్వమే అనుమతి ఇవ్వాలి. దీని ఏర్పాటుకు చర్యలు తీసుకుంటే ప్రజల ఆకాంక్ష నెరవేరనుంది.

Updated Date - Dec 02 , 2025 | 12:45 AM