అదే నిర్లక్ష్యం
ABN , Publish Date - Nov 04 , 2025 | 01:12 AM
కర్నూలు జిల్లాలో వి.కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం ఘటనలో ప్రయాణికుల సజీవ దహనం మరువక ముందే.. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో దుర్ఘటనలో బస్సుపైకి దూసుకొచ్చిన కంకర లారీ ప్రమాదంలో 19 మంది మృత్యువాత పడిన ఘట న జరిగిన రోజునే ఏలూరు జిల్లాలో మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
మద్యం మత్తులో డ్రైవర్
ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం
జూబ్లీనగర్ వద్ద భారతీ ట్రావెల్స్ బస్సు బోల్తా.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి
ముగ్గురికి తీవ్రం, ఏడుగురికి స్వల్ప గాయాలు
కాపాడిన స్థానికులు.. ఆసుపత్రులకు తరలింపు.. డ్రైవర్, క్లీనర్ పరార్..
తనిఖీలంటూ మొన్న రెండు రోజులు హడావుడి చేసిన రవాణా శాఖ అధికారులు
వరుస ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోని వైనం
లింగపాలెం/చింతలపూడి/ఏలూరు, నవంబరు 3(ఆంధ్ర జ్యోతి):కర్నూలు జిల్లాలో వి.కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం ఘటనలో ప్రయాణికుల సజీవ దహనం మరువక ముందే.. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో దుర్ఘటనలో బస్సుపైకి దూసుకొచ్చిన కంకర లారీ ప్రమాదంలో 19 మంది మృత్యువాత పడిన ఘట న జరిగిన రోజునే ఏలూరు జిల్లాలో మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో డ్రైవర్ బస్సు నడిపిన కారణంగా 25 ఏళ్ల ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ప్రాణం బలి అయ్యింది. ముగ్గురికి తీవ్రంగా, మరో ఏడుగురికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే హడా వుడి చేసే రవాణాశాఖ అధికారులు.. రెండో రోజే తనిఖీలు చేయాల్సిన బాధ్యత తమది కాదన్నట్టు వ్యవహరిస్తుంటారు. ఇదేకోవలో సోమవారం రాత్రి లింగపాలెం మండలం ధర్మాజీ గూడెం నుంచి హైదరాబాద్ వెళుతున్న బస్సు భారతీ ట్రావెల్స్ స్లీపర్ బస్సు (ఏఆర్ 06 బి 8428) డ్రైవర్ మద్యం మత్తులో డ్రైవింగ్ చేసినా పట్టించుకోలేదు. ఫలితంగా లింగ పాలెం మండలం జూబ్లీనగర్ మలుపు వద్ద టర్నింగ్ వద్ద బస్సును తిప్పలేక సోమవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో బోల్తా కొట్టించాడు. ఈ ప్రమా దంలో ఇదే మండలానికి చెందిన అయ్యపరాజు గూడెంకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వీరంకి ప్రవీణ్‌బాబు(25) అక్కడక్కడే మృతి చెందాడు. డ్రైవర్‌తోపాటు నరసన్నపాలెం, యడవల్లి, ధర్మాజీగూడెం, లింగపాలెం, అయ్యపరాజుగూడెంకు చెందిన 16 మంది మంది బస్సులో ప్రయాణిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే డ్రైవర్, క్లీనర్‌లు పరారయ్యారు. మృతదేహాన్ని చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఉద్యోగ బాధ్యతల నిమిత్తం కోసం వెళ్తూ ఊరికి దగ్గరలోనే ప్రవీణ్ మృత్యువాత పడటంతో తండ్రి వెంకన్న ప్రభుత్వాసుపత్రిలో రోదనలు మిన్నం టాయి. ఈ మరణానికి ఎవరిది బాధ్యత..?
మలుపులో ఇది మూడో ప్రమాదం
జూబ్లీనగర్ మలుపు వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం మూడోది. మలుపు వద్ద గోతులు వుండటం వల్ల అంతకుముందు ఇక్కడే రెండు ప్రమాదాలు జరిగాయి. బస్సు తొలుత మఠం గూడెం–లింగపాలెంలో మధ్యలో ఆటోను రాసుకుంటూ వెళ్లింది. అక్కడ నుంచి వేగంగా వెళ్తూ మోటారు సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరిని ఢీకొట్టింది. వారు గాయప డ్డారు. తర్వాత మలుపు వద్ద బస్సు బోల్తా కొట్టింది. బస్సు పడినచోట గొయ్యి ఉండటంతో అందులో పడి ప్రవీణ్‌బాబు మృత్యువాత పడ్డాడు. సమాచారం అందడంతో సీఐ క్రాంతికుమార్, ఎస్‌ఐలు క్షతగాత్రులను అంబులెన్స్‌లో వైద్యం కోసం తరలించారు. ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్ వచ్చి పరిస్థితిని ఆరా తీశా రు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రవీణ్‌బాబు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
క్షతగాత్రులు వీరే
బస్సులో ప్రయాణిస్తున్న 13 మందిని బయటకు తీశారు. స్వల్పగాయాలైన వారిలో 10 మందిని లింగపాలెం పీహెచ్‌సీకి, ఆసన్నగూడేనికి చెందిన అడపా సురేష్‌ను చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయ పడిన వారిలో జి.వంశీ, ఎం.కిరణ్, కె.వేణుగోపాలకృష్ణ, కె.నాగశిరోమణి, కె.నాగవెం కట ప్రవీణ్, సీహెచ్ ఈశ్వర్, వి.బెంజిమన్, ప్రసాదరెడ్డి, జి.వెంకటరెడ్డి, జి.వెంక టలక్ష్మితో పాటు మరో ఇద్దరు ఉన్నారు. కాగా బస్సు ఢీకొట్టగా గాయపడిన బైక్ మీద వెళ్తున్న బి.రెడ్డయ్య, పేరం కృష్ణను తొలుత లింగపాలెం పీహెచ్‌సీకి ఆపై ఏలూరు ప్రభుత్వాస్పతికి తరలించారు.
సత్వరం వైద్యం అందించాలని కలెక్టర్ ఆదేశం
బస్సు ప్రమాద సంఘటన విషయం తెలుసుకున్న కలెక్టర్ వెట్రిసెల్వి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రులకు తరలించి మెరుగైన వైద్యం అందించాలని డీఎంహెచ్‌వో అమృతంను ఆదేశించారు. పరిస్థితిని సమీ క్షించుకుని అధికారులతో సమన్వయం చేసుకోవాలని సహాయ చర్యలను చేప ట్టాలని నూజివీడు సబ్ కలెక్టర్ వినూత్నను కలెక్టర్ ఆదేశించారు.