శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ABN , Publish Date - Sep 23 , 2025 | 12:21 AM
వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆశ్వయుజ మాస దివ్య బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు.
వచ్చేనెల 2 నుంచి 9 వరకు ఆశ్వయుజ మాస దివ్య బ్రహ్మోత్సవాలు
6న స్వామి వారి కల్యాణం
7న రథోత్సవం
ద్వారకాతిరుమల, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆశ్వయుజ మాస దివ్య బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెల 2 నుంచి 9 వర కూ వైఖానస ఆగమయుక్తంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని ఆలయ ఈవో ఎన్వీ ఎస్‌ఎన్ మూర్తి తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆయా రోజుల్లో నిత్యార్జిత కల్యా ణాలను, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్టు ఆయన వివరించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా వచ్చేనెల 2న ఉదయం స్వామి, అమ్మవార్లను వధూవరులుగా అలంకరిస్తారు. 3న ధ్వజారోహణ, 5న రాత్రి 7గంటల కు ఎదుర్కోలు ఉత్సవం, 6న రాత్రి 8గంటలకు శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవం నిర్వహించనున్న ట్లు ఈవో తెలిపారు. 7న రాత్రి 8గంటలకు రథోత్సవం, 8న శ్రీచక్రవార్యుత్సవం, ధ్వజావరోహణ జరుగుందన్నారు. 9న ఉదయం 9గం.లకు చూర్ణో త్సవం, వసంతోత్సవం, రాత్రి ద్వాదశకోవెల ప్రదక్షిణ, శ్రీపుష్పయాగోత్సవంతో ఉత్సవాలు పరిసమాప్తమవు తాయని భక్తులు గమనించాలని ఆయన కోరారు.
నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలు రద్దు
శ్రీవారి దివ్య బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని వచ్చేనెల 2 నుండి 9 వరకూ నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ఈవో తెలిపారు.
వాహన సేవలు ఇలా
2న రాత్రి 7గంటలకు గజవాహనంపై శ్రీవారి తిరువీధిసేవ.
3న రాత్రి 9గంటలకు ధ్వజారోహణ అనంతరం హంస వాహనంపై తిరువీథిసేవ.
4న ఉదయం7గం.లకు సూర్యప్రభ, రాత్రి 7గంటలకు చంద్రప్రభపై గ్రామోత్సవం.
5న ఉదయం 7గంటలకు హనుమద్వాహనంపై తిరువీథిసేవ.
6న రాత్రి 8గంటలకు శ్రీవారి కల్యాణం అనంతరం వెండి గరుడ వాహనాలపై తిరువీధి సేవలు.
7న రాత్రి 8గంటలకు రథవాహనంపై శ్రీవారి తిరువీధిసేవ.
8న రాత్రి 9 గంటల అనంతరం అశ్వ వాహన సేవ.
ప్రతీరోజూ ఉదయం 8.30 నుంచి రాత్రి 9గంటల వరకూ వేదపారాయణలు, సాంస్కృతిక కార్యక్రమాలు.