సూర్య, చంద్ర వాహనాలపై శ్రీవారు
ABN , Publish Date - May 10 , 2025 | 12:31 AM
ధనుర్భాణాలను ధరించి శ్రీరామునిగా చిన్న తిరుమలేశుడు భక్తజనులను అనుగ్రహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరుగుతున్న అలంకారాల్లో శుక్రవారం వేంకటేశ్వరస్వామి రామునిగా శ్రీవారు కనువిందు చేశారు.

ద్వారకాతిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
ధనుర్భాణాలను ధరించి శ్రీరామునిగా చిన్న తిరుమలేశుడు భక్తజనులను అనుగ్రహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరుగుతున్న అలంకారాల్లో శుక్రవారం వేంకటేశ్వరస్వామి రామునిగా శ్రీవారు కనువిందు చేశారు.
ద్వారకాతిరుమల, మే 9 (ఆంధ్రజ్యోతి): సప్త అశ్వాలను అధిరోహించిన సూర్యభగవానుడిని వాహనంగా చేసుకుని చిన్నతిరుమలేశుడు శుక్రవారం ఉదయం పురవీథుల్లో భక్తులను అనుగ్రహించారు. ఉదయం ఆలయంలో సూర్యప్రభ వాహనంపై ఉభయదేవేరులతో శ్రీవారిని ప్రత్యేక అలంకరణ చేసి హారతులిచ్చారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడు మ గజసేవతో అట్టహాసంగా తిరువీథులకు తీసుకెళ్లారు. రాత్రి చంద్రప్రభ వాహనంపై భక్తులకు కనువిందు చేశారు.
చిన వెంకన్నకు టీటీడీ పట్టు వస్త్రాలు
చిన్నతిరుమలేశునికి ఆదివారం జరగనున్న దివ్య కల్యాణమహోత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన అధికా రులు పట్టు వస్త్రాలు అందజేశారు. పట్టువ స్త్రాలను శిరస్సుపై ఉంచుకుని ఆలయ ఆవరణలో ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఏఈవో నటరాజారావుకు అందించారు. స్వామి, అమ్మవార్ల కల్యాణం రోజున తిరుమల దేవస్థానం తరపున అందించాలని కోరారు.