Share News

శ్రీవారి జల విహారం

ABN , Publish Date - Nov 03 , 2025 | 12:00 AM

సుద ర్శన పుష్కరిణిలో హంస వాహనంపై చిన వెంకన్న ఉభయనాంచారులతో ఆదివారం రాత్రి జల విహారం చేశారు.

శ్రీవారి జల విహారం
ద్వారకాతిరుమలలో చిన వెంకన్న జల విహారం

ద్వారకాతిరుమల, ఆచంట, కాళ్లకూరులో వైభవంగా తెప్పోత్సవం

ద్వారకాతిరుమల, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): సుద ర్శన పుష్కరిణిలో హంస వాహనంపై చిన వెంకన్న ఉభయనాంచారులతో ఆదివారం రాత్రి జల విహారం చేశారు. క్షీరాబ్ది ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని జరిగిన తెప్పోత్సవం భక్తులకు నేత్రపర్వమైంది. విద్యుద్దీపకాంతులు, కోలాట భజనలు, డప్పు వాయి ద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ, బాణసంచా మోత, అర్చకుల వేదఘోషల నడుమ జరిగిన ఉత్సవం కనువిందు చేసింది. ముందుగా ఆలయంలో తొళక్కవాహనంపై స్వామి, అమ్మవార్లను ఉంచి అర్చకులు ప్రత్యేక పుష్పాలంకారాలు చేశారు. అనంత రం మేళతాళాలు, సన్నాయి డోలు వాయిద్యాల నడు మ ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా శ్రీవారి వాహనం పురవీధులకు పయనమైంది. తిరువీధి సేవ అనంతరం వాహనాన్ని సుదర్శన పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. పుష్కరిణిలో హంసవాహనంగా అలం కరించిన తెప్పలో స్వామి, అమ్మవార్లను ఉంచి అర్చ కులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చైర్మన్‌ రాజా ఎస్వీ సుధాకరరావు, ట్రస్టీ ఎస్‌వి నివృతరావు, ఈవో ఎన్వీ సత్యనారాయణమూర్తి స్వామి, అమ్మవార్లకు పూజలు చేశారు. అనంతరం భక్తుల గోవింద నామస్మరణ నడుమ తెప్ప పుష్కరిణిలో విహరించిం ది. పుష్కరిణి మధ్యనున్న మండపంలో శ్రీవారు. పద్మావతి, ఆండాళ్‌ అమ్మవార్ల నుంచి అర్చకులు పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు ఉత్సవ వైభవాన్ని వీక్షించారు.

ఆచంటలో వైభవంగా తెప్పోత్సవం

ఆచంట, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా ఆచంటేశ్వరుని ఆలయం ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు పూజలు, అభిషేకాలతో కిటకిటలాడింది. సాయంత్రం రామ గుం డం చెరువులో ఆచంటేశ్వరుని సన్నిధిలోని సత్యనారా యణస్వామి, మదన గోపాలస్వామి వార్ల జల విహా రం కన్నుల పండువగా జరిగింది. స్వామి వార్ల గ్రామోత్సవం అనంతరం రామగుండం చెరువు వద్ద పూజలు నిర్వహించి అలంకరించిన రెండు పడవల్లో బాణసంచా కాల్పుల నడుమ స్వామి వార్ల తెప్పోత్స వం నిర్వహించారు. ఆచంట, పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయ చైర్మన్‌ నెక్కంటి గజేశ్వరరావు, ఈవో ఆదిమూలం వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆచంట ఎస్‌ఐ కట్టా వెంకటరమణ ఆధ్వర్యంలో పోలీసు బందో బస్తు నిర్వహించారు.

కాళ్లకూరులో క్షీరాబ్ది ద్వాదశి పూజలు

కాళ్ల, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): కాళ్లకూరు వేంకటేశ్వరస్వామి ఆలయంలో కార్తీక మాసం క్షీరాబ్ది (చిలుకు) ద్వాదశి సందర్భంగా ఆదివారం రాత్రి కన్నుల పండువగా శ్రీవారికి తెప్పోత్సవం నిర్వహించారు. మేళతాళాలతో తొలుత స్వామి, అమ్మవార్లను శేష వాహనంపై పురవీధుల మీదుగా పద్మావతి పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన హంస వాహనంపై పూజలు నిర్వహించారు. బాణసంచా వెలుగులు, వేదమంత్రాల నడుమ గోవింద నామస్మరణతో భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. డిప్యూటీ స్పీకర్‌ తనయుడు భరత్‌, పరిసర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తెప్పోత్సవం సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను దేవస్థానం ఈవో ఎం.అరుణకుమార్‌, సిబ్బంది పర్యవేక్షించారు.

Updated Date - Nov 03 , 2025 | 12:00 AM