బూత్ స్థాయి నుంచి బీజేపీ బలపడాలి
ABN , Publish Date - Sep 04 , 2025 | 01:17 AM
‘బీజేపీలో బూత్‌స్థాయి నుంచి పనిచేసిన వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుంది. ఒక కార్యకర్తగా ఉంటూ అంచెలంచెలుగా రాష్ట్ర పగ్గాలు అందు కున్న నేనే అందుకు ఉదాహరణ’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ చెప్పారు.
అపరిష్కృత సమస్యలు పరిష్కరిస్తాం
ఆక్వా, నిమ్మ మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగు పరుస్తాం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్
ఏలూరు, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): ‘బీజేపీలో బూత్‌స్థాయి నుంచి పనిచేసిన వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుంది. ఒక కార్యకర్తగా ఉంటూ అంచెలంచెలుగా రాష్ట్ర పగ్గాలు అందు కున్న నేనే అందుకు ఉదాహరణ’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ చెప్పారు. సారథ్యం యాత్రలో భాగంగా ఆయన బుధ వారం ఏలూరులో పర్యటించారు. ఉదయం ఏలూరు బిర్లాభవన్ సెంటర్‌లో ఛాయ్ పే చర్చ లో పాల్గొని పేదల సమస్యలను అడిగి తెలు సుకున్నారు. అణగారిన వర్గాల గుర్తింపునకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రభుత్వాసుపత్రి రోడ్డులోని స్వాతంత్య్ర సమరయోధుడు మూర్తి రాజు విగ్రహానికి, పాత బస్టాండ్ వద్ద బీఆర్ అం బేడ్కర్ చిత్రపటానికి మాధవ్, జిల్లా అధ్యక్షుడు విక్రమ్ కిశోర్, గారపాటి తపనాచౌదరి, అంబికా కృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాతబస్టాండ్ నుంచి జూట్‌మిల్లు వరకు బ్యాండ్ మేళాలు, నృత్యప్రదర్శనలు, నాయకులు, కార్య కర్తలతో కలసి మోదీ మాస్కులను ధరించి సాగిన శోభాయాత్రను నగరంలో రక్తి కట్టిం చారు.
ప్రజల్లో మమేకం కావాలి
బైపాస్ రోడ్డులో జిల్లా అధ్యక్షుడు విక్రమ్ కిశోర్ అఽధ్యక్షతన సారథ్యం – జిల్లా పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో మాధవ్ మాట్లాడుతూ ’త్యాగం, కృషి, పట్టుదల, క్రమ శిక్షణ, బలిదానాలే ప్రధాన ఆయుధంగా పార్టీ శ్రేణులు ప్రజల్లోకి మమేకం కావాలి. రాష్ట్రంలో సంక్షేమం–అభివృద్ధి పఽథకాల్లో సింహభాగం కేటా యించడంలో మోదీ ప్రభుత్వం ముందుందనే విషయాన్ని ప్రజలకు వివరించాలి. పోలవరం ప్రాజెక్టు మరింత వేగవంతానికి రూ.15 వేల కోట్లు కేంద్రం ఇచ్చింది. కొల్లేరులో మూడు లక్షల మంది పేదలకు న్యాయం చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. కూటమి ప్రభుత్వం సమిష్టి కృషి వలన రూ.10 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చా యి. ఆక్వా, నిమ్మ ఉత్పత్తుల మార్కెటింగ్ సౌక ర్యాలను మెరుగుపరుస్తాం. ఆక్వా కల్చర్ అభ్యు న్నతి, రవాణా, ఇతర సౌకర్యాలకు రాబోయే రోజుల్లో రూ.550 కోట్లతో ఒక ప్రణాళికను రూ పొందిస్తాం. జిల్లాలో అపరిష్కృత సమస్యల పరి ష్కారానికి కృషి చేస్తా’మని మాధవ్ అన్నారు.
కొల్లేరు సమస్య పరిష్కరించాలి
బీజేపీ కార్యకర్తగా పనిచేయడం వల్లే 11 ఏళ్లలో ఎంతో మంది జిల్లా నుంచి నేతలు జాతీ య స్థాయిలో మంత్రులు, ఇతర ప్రజాప్రతి నిధులుగా ఎదిగిన విషయాన్ని గుర్తెరిగి.. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కంకణ బద్దులు కావాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తపనా చౌదరి, నిర్మలా కిషోర్ అన్నారు. ‘కొల్లేరు కాంటూ రు కుదింపు సమస్యను పరిష్కరించాలి. గ్రీన్‌ఫీల్డ్ హైవేకు అప్రోచ్ రోడ్లు నిర్మాణం చేపట్టాల’ని జిల్లా అధ్యక్షుడు విక్రమ్ కిషోర్ కోరారు. నీతి నిజాయితీలతో నిబద్ధతతో పనిచేస్తున్న నాయ కులను వెతికి వారికి పదవులు ఇచ్చి సముచిత గౌరవం ఇస్తున్న పార్టీ బీజేపీయే.. అందుకు నిదర్శనం బీసీ నేత, రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ, రాష్ట్ర అఽఽధ్యక్షుడు మాధవ్‌లే అని పార్టీ రాష్ట్ర ముఖ్య ఆహ్వానితులు అంబికా కృష్ణ హర్షం వ్యక్తం చేశారు. కొల్లేరు కాంటూరు కుదింపు సాధ్యం కాదని, అయితే జిరాయితీ, పట్టా భూముల్లోని వేలాది మందికి న్యాయం చేసే పని కేంద్రం చేస్తుందని కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. సాయంత్రం కొత్తబ స్టాండ్ ప్రాంతంలో అంబికా కృష్ణ ఆధ్వర్యంలో మేధావులు, పురప్రముఖులు, పారిశ్రామికవేత్తల తోను మాధవ్ సమావేశం అయ్యారు. సెంట్రల్ కమిటీ సభ్యులు మధుకర్‌జీ, రాష్ట్ర యువమోర్చా అఽధ్యక్షులు సునీల్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర మహిళా నాయకురాలు శరణాల మాలతీరాణి, రాష్ట్ర కార్య దర్శులు లక్ష్మీప్రసన్న నాగోతి రమేష్ నాయుడు, జిల్లా కార్యదర్శి గాది రాంబాబు, కొరళ్ల సుధాక రకృష్ణ, జిల్లా పార్టీ ఇన్‌ఛార్జి నరేంద్రప్రకాష్, కట్నేని లక్ష్మీప్రసాద్, ఇందుకూరి అశోక్‌చక్రవర్తి, కారంకి శ్రీనివాస్, నగరపాటి సత్యనారాయణ, గుమ్మడి చైతన్య, నారాయణ పాల్గొన్నారు.