Share News

అపోహలొద్దు

ABN , Publish Date - May 01 , 2025 | 11:52 PM

తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలి శెట్టి శ్రీనివాస్‌, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ వలవల బాబ్జిలు ఇద్దరూ సమన్వయంతో కలిసి ముందుకు వెళ్లాలని ఇరు పార్టీల అగ్ర నాయకులు కర్తవ్యబోధ చేశారు.

అపోహలొద్దు
చేతులు కలిపిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి, టీడీపీ ఇన్‌చార్జ్‌ వలవల తదితరులు

సమన్వయంతో ముందుకు వెళ్లండి

కూటమి పార్టీలు మరో పదేళ్లు.. కలిసే ముందుకు..

ఎమ్మెల్యే బొలిశెట్టి, టీడీపీ ఇన్‌చార్జ్‌ వలవలకు పార్టీల పెద్దలు కర్తవ్యబోధ

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలి శెట్టి శ్రీనివాస్‌, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ వలవల బాబ్జిలు ఇద్దరూ సమన్వయంతో కలిసి ముందుకు వెళ్లాలని ఇరు పార్టీల అగ్ర నాయకులు కర్తవ్యబోధ చేశారు. ఇరువురు నేతలతో చేతులు కలిపించి ఎలాంటి అపో హలు లేకుండా సాగాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంతో ఇరువురు నేతల మధ్య కొన్నాళ్లు నెలకొన్న మనస్పర్థలకు తెరపడినట్లే!

నియోజకవర్గంలో ఇరువురు నేతల మధ్య కొన్నాళ్లుగా అపోహలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం పట్టణంలో జరి గిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీని వాస్‌.. ‘ఉప ఎన్నికల కోసం.. తాను చనిపో వాలని కొందరు కోరుకుంటున్నట్టు’ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ‘ఎమ్మెల్యే గా ప్రజలు నన్ను గెలిపించి తీర్పు ఇచ్చారు. కాని, పాలనలో కొందరి జోక్యం ఉంటోంది. అధికారులను బెదిరిస్తున్నార’ంటూ ఎమ్మెల్యే టీడీపీ ఇన్‌చార్జ్‌ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. మరోవైపు టీడీపీ ఎస్‌సి సెల్‌లోని ఓ కార్యకర్త ‘తాడేపల్లిగూడెం మరో పిఠాపురం కాకుండా చూసుకోవాలి’ అంటూ తెలుగుదేశం పార్టీ సభలో చేసిన వ్యాఖ్యలు ఎమ్మెల్యే దృష్టికి వెళ్లాయి. ఈ వ్యాఖ్యలు చేసిన వ్యక్తి కిడ్నీ సమస్యతో బాధపడుతు న్నారు. ఈ నేపథ్యంలో అతనికి ముఖ్యమం త్రి సహాయనిధి నుంచి రూ.12 లక్షలు మం జూరయ్యేలా బాబ్జి ప్రయత్నించారు. అతనిని తీసుకుని సీఎం చంద్రబాబు వద్దకు తీసుకు వెళ్లారు. బొలిశెట్టి, బాబ్జిల మధ్య అంతరానికి ఇది మరో కారణం.

మరోవైపు కూటమిలో కొందరు నాయకు లు ఇరువురి నేతల వద్దకు వెళుతున్నారు. తెలుగుదేశం ఇన్‌చార్జ్‌ కార్యాలయంలో జరి గిన అంతర్గత సంభాషణలను ఎమ్మెల్యే కార్యాలయానికి చేరవేస్తున్నారు. అలాగే ఎమ్మెల్యే కార్యాలయంలో వ్యక్తిగతంగా చర్చిం చుకునే విషయాలను తెలుగుదేశం కార్యాల యం వద్ద ప్రస్తావిస్తున్నారు. తమ స్వప్ర యోజనాల కోసం ఎక్కడ తాళం అక్కడ వేస్తున్నారు. ఇటువంటి నాయకులతోనూ రెండు పార్టీల మధ్య, ఈ ఇరువురి నేతల మధ్య భేదాభిప్రాయాలు పెరగడానికి కారణ మవుతోందంటూ కూటమి శ్రేణుల్లో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బొలి శెట్టి బుధవారం చేసిన వ్యాఖ్యలతో ఇరువురి మధ్య భేదాభిప్రాయాలు వున్నట్టు బహిర్గ తమైంది. ఈ విషయాన్ని గ్రహించిన ఇరు పార్టీల అధిష్ఠానాలు వీరిద్దరిని గురువారం విజయవాడ పిలిపించి మాట్లాడారు.

చేతులు కలిపారిలా..

తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీని వాస్‌, మంత్రి నిమ్మల రామానాయుడు, జనసేన ఎమ్మెల్సీ హరిప్రసాద్‌, పార్టీ నాయ కులు కె.కె.సత్యనారాయణ, చక్రవర్తిలతో కూడిన సమన్వయ కమిటీ బొలిశెట్టి, బాబ్జి లతో భేటీ అయ్యింది. ఇరువురి వాదనలు విన్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి చేసిన వ్యాఖ్యలపై ఇరువురి నుంచి వివరాలు సేకరించారు. నాయకులు ప్రస్తావించిన విషయాల్లో కొన్నింటిని విస్మరించాలని కమిటీ నేతలు ఇద్దరికి దిశా నిర్దేశం చేశారు. అందుకు వీరు అంగీకరించారు. నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఇద్ద రు కలిసిమెలిసి వెళ్లాలని సూచించారు. కలిసి ముందుకు వెళ్లేందుకు వీరిద్దరూ అంగీకరించడంతో కో–ఆర్డినేషన్‌ కమిటీ నేతలు సంతృప్తి చెందారు. భేటీలో బొలి శెట్టి., బాబ్జిలతో చేతులు కలిపించారు.

Updated Date - May 01 , 2025 | 11:52 PM