Share News

పశ్చిమగోదావరికి మహర్దశ

ABN , Publish Date - Jul 12 , 2025 | 12:11 AM

భీమవరం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీకి అడుగులు పడుతున్నాయి.

పశ్చిమగోదావరికి మహర్దశ

భీమవరం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీకి ప్రతిపాదనలు

వివరాలు కోరిన సీఎంవో

నివేదిక పంపిన జిల్లా అధికారులు

ఏడాదికి రూ.1.19 కోట్లు వ్యయం అంచనా

ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూపు

భీమవరం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీకి అడుగులు పడుతున్నాయి. జిల్లాకు ప్రత్యేక అథారిటీ ఉండాలని కొద్ది నెలల క్రితం తణుకులో పర్యటించిన సీఎం చంద్రబాబు దృష్టికి కలెక్టర్‌ తీసుకువెళ్లారు. ప్రజా ప్రతినిధులు ప్రయత్నాలు చేశారు. ఈ మేరకు సీఎంవో కార్యాలయ అధికారులు వివరాలు కోరారు.

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

ప్రస్తుతం జిల్లాలోని ఏడు నియోజకవర్గాలు ఏలూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(ఇడా) పరిధిలో ఉన్నాయి. అపార్ట్‌మెంట్‌లు, ఇతర నిర్మాణా లకు అనుమతి కోసం ఇడాకు ప్లాన్‌ అందజేసి దర ఖాస్తు చేయాలి. దరఖాస్తుదారులు చెల్లించే రుసు ములో 20 శాతం ఇడాకు వెళుతోంది. ఆ నిధులతో అభివృద్ధి పనులు చేపడతారు. కానీ ఇప్పటి వరకు జిల్లాలో ఇడా ఆధ్వర్యంలో ఎటువంటి పనులు నిర్వ హించలేదు. ఉమ్మడి పశ్చిమలోని చాలా నియోజకవ ర్గాలు ఇడా పరిధిలో ఉన్నాయి. భీమవరం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటుచేస్తే జిల్లాలో నిర్మాణాల ప్లాన్‌ అప్రూవల్స్‌ అన్నీ దీని పరిధిలోకి వస్తాయి. ప్లాన్‌ల ద్వారా వచ్చిన ఆదాయంలో సంబంధిత స్థానిక సంస్థలకు 80 శాతం, మిగిలిన 20శాతం అథారిటీకి చెందనున్నాయి. ఇడాకు వచ్చిన ఆదాయంలో ఇప్పటి వరకు స్థానిక సంస్థలకు జమ కాకపోవడంతో పంచాయతీలు ఎదురుచూస్తున్నా యి. ఈ నేపథ్యంలో భీమవరం అర్డన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ బలపడింది. జిల్లా నేతలు గట్టి కృషి చేస్తున్నారు.

జిల్లాలో పట్టణాలు, మండలాలు, జనాభా వివరా లను అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి నివేదించారు. జిల్లా జనాభా 20 లక్షలకు పైగా ఉంద ని అంచనా. భీమవరం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథా రిటీ ఏర్పాటుతో ఏడాదికి రూ.1.19 కోట్లు వ్యయం అవుతుందని అంచనాతో ప్రతిపాదనలను కలెక్టర్‌ ప్రభుత్వానికి పంపించారు. అథారిటీ కోసం ప్రత్యేక కార్యాలయం ఉంటుంది. అధికారులతోపాటు, ప్రభుత్వం నియమించే చైర్మన్‌ ఉంటారు.

పట్టణాలకు మినహాయింపు

గతంలో అర్బన్‌ డెవపల్‌మెంట్‌ పరిధిలోకి పట్టణా లను చేర్చారు. నిర్మాణం సుమారు 300 గజాలు దాటితే ఇడా అనుమతి కోసం పంపుతున్నారు. ఇటీవల అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ నుంచి పట్టణాలను మినహాయించారు. నిర్మాణదారులు వెయ్యి గజాల వరకు మునిసిపాలిటీల్లోనే అనుమతి తీసుకోవాలి. అంతకు మించితే డైరెక్టరేట్‌ ఆఫ్‌ కంట్రీ ప్లానింగ్‌కు అనుమతికోసం పంపున్నారు. ఇలా ప్లాన్‌ అనుమతుల విషయంలో మున్సిపాలిటీ లకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. పంచాయతీల్లో అనుమతులు మాత్రం అర్బన్‌ డెవపల్‌మెంట్‌ అథారిటీ పరిధిలోకి వస్తాయి. జిల్లాలోని భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, ఆచంట, నరసాపురం, ఉండి నియోజకవర్గాల పరిధిలో పంచాయతీలు ఏలూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీలో ఉన్నాయి. భీమవరం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటైతే జిల్లాలోని పంచాయతీలన్నీ దీనిపరిధిలోకి వస్తాయి. ప్రస్తుతం మున్సిపాలిటీలకు ఆనుకుని ఉన్న పంచా యతీల్లో నిర్మాణాలు అధికంగా జరుగుతున్నాయి. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలకు ఆనుకుని ఉన్న పంచాయతీల్లో నిర్మాణ రంగం వృద్ధి చెందుతోంది. ఇవన్నీ భీమవరం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారి టీలోకి రానున్నాయి. ఏలూరు నుంచి విడగొట్టి భీమవరానికి ప్రత్యేకంగా అథారిటీని ఇవ్వాలన్న డిమాండ్‌తో జిల్లా అధికార యంత్రాంగం ఆదిశగా ప్రతిపాదనలు పంపింది. ప్రజాప్రతినిధులు దీనికోసం గట్టి ప్రయత్నం చేస్తున్నారు.

Updated Date - Jul 12 , 2025 | 12:11 AM