Share News

బంగారు కుటుంబాలకు ఆర్థిక సహకారం

ABN , Publish Date - Dec 04 , 2025 | 01:10 AM

బంగారు కుటుంబాలకు మార్గదర్శులు తమ వంతు ఆర్థిక సహకారం అందించడంలో ముండుగు వేశారు. ఉంగుటూరు మండలం నల్లమాడులో సోమవారం జరిగిన సీఎం చంద్రబాబు సభలో పీ–4లో భాగంగా పారిశ్రామికవేత్త మనోజ్‌కుమార్‌ సొంకార్‌ బంగారు కుటుంబాలను దత్తత స్వీకరించిన విషయం విదితమే.

బంగారు కుటుంబాలకు ఆర్థిక సహకారం
వెంకటలక్ష్మికి ఆర్థిక సాయం అందజేస్తున్న మార్గదర్శి మనోజ్‌కుమార్‌ సొంకార్‌ దంపతులు

నిడమర్రు డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): బంగారు కుటుంబాలకు మార్గదర్శులు తమ వంతు ఆర్థిక సహకారం అందించడంలో ముండుగు వేశారు. ఉంగుటూరు మండలం నల్లమాడులో సోమవారం జరిగిన సీఎం చంద్రబాబు సభలో పీ–4లో భాగంగా పారిశ్రామికవేత్త మనోజ్‌కుమార్‌ సొంకార్‌ బంగారు కుటుంబాలను దత్తత స్వీకరించిన విషయం విదితమే. ఈ క్రమంలో ఆయన కుటుంబ సమేతంగా బుధవారం దత్తత కుటుంబాల వద్దకు వెళ్లి తొలిగా తనవంతు ఆర్థిక సహకారంగా నిత్యావసర సరుకులు, పిల్లలకు దుస్తులు అందజేశారు. నల్లమాడుకు చెందిన దత్తత కుటుంబ సభ్యులు శాఖమూరి వెంకటేశ్‌ దంపతులతో మాట్లాడుతూ మీ పిల్లలకు స్కూల్‌ ఫీజులు కడతానని, కుటుంబ సభ్యులు ఇద్దరికీ తమ ఫ్యాక్టరీలో ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. రామచంద్రపురా నికి చెందిన ఒంటరి మహిళ శ్రీరాముల వెంకట లక్ష్మీ ఇంటివెళ్లి ఆమెకు కొంత ఆర్థికసాయం అంద జేశారు. టీడీపీ మండల పార్టీ అధ్య క్షుడు వెల్లంపల్లి సుధీర్‌, సింగలూరి రామకృష్ణ, పాతూరి నాని, ఆచంట సత్యనారాయణ, నల్ల ఆనంద్‌, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Dec 04 , 2025 | 01:10 AM