Share News

టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా బడేటి చంటి

ABN , Publish Date - Dec 22 , 2025 | 12:39 AM

నాలుగు దశాబ్దాల టీడీపీ చరిత్రలో ఏలూ రుకు అరుదైన అవకాశం పార్లమెంట్‌ నియోజక వర్గ అధ్యక్ష పదవి రూపంలో ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య(చంటి)ని వరించింది.

 టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా బడేటి చంటి

ఏలూరుకు అరుదైన అవకాశం

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

నాలుగు దశాబ్దాల టీడీపీ చరిత్రలో ఏలూ రుకు అరుదైన అవకాశం పార్లమెంట్‌ నియోజక వర్గ అధ్యక్ష పదవి రూపంలో ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య(చంటి)ని వరించింది. ప్రధాన కార్యదర్శిగా సీనియర్‌ నేత, చింతలపూడి ఏఎం సీ మాజీ చైర్మన్‌ జగ్గవరపు ముత్తారెడ్డి (యర్రం పల్లి) నియమితులయ్యారు. ఐదు నెలలు నుంచి అధ్యక్ష పదవిపై ఉత్కంఠకు టీడీపీ అఽధిష్టానం తెరదించింది. పార్లమెంట్‌ నియోజకవర్గాల అధ్య క్ష, కార్యదర్శుల జాబితా ఆదివారం చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. కాపు సామాజిక వర్గానికి చెందిన బడేటి చంటి వివాదాలకు దూరంగా, అతి తక్కువ కాలంలో రాజకీయంగా ఎదిగారు. బడేటి కుటుంబం ఏలూరుతో విడదీ యరాని రాజకీయ బంధం ఏర్పరచుకుంది. చంటి తాత బడేటి వెంట్రామయ్య ఏలూరు బో ర్డు చైర్మన్‌, మునిసిపల్‌ చైర్మన్‌గా, తండ్రి బడేటి శ్రీహరిరావు 1980వ దశకంలో మునిసిపల్‌ చైర్మ న్‌గా పనిచేశారు. రాధాకృష్ణయ్య అన్న బడేటి బుజ్జి వరుసగా మూడు దఫాలు వైస్‌ చైర్మన్‌గా, 2014 ఎమ్మెల్యేగా పనిచేశారు. రెండో అన్నయ్య బడేటి వెంకట్రామయ్య (వెయిట్‌లిఫ్టింగ్‌ అసోసి యేషన్‌ నేత) భార్య పద్మావతి కూడా ఏలూరు కార్పొరేటర్‌గా పనిచేశారు. వరుసగా ఆ కుటుం బం నుంచి ఏలూరులో కీలక పదవులను వరిం చడం విశేషం. అనతికాలంలో రాజకీయాల్లో మంచి గుర్తింపు సాధించిన బడేటి చంటి నాయకత్వంలో పార్టీ మరింత ముందంజలో తీసుకురావడానికి పనిచేయాల్సి ఉంటుంది.

పార్టీని మరింత బలోపేతం చేస్తా

ఏలూరు టూటౌన్‌, డిసెంబరు 21 (ఆంధ్ర జ్యోతి): తన పని తీరును గుర్తించి టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా నియమించిన ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు, మంత్రి లోకేశ్‌కు ఎమ్మెల్యే బడేటి చంటి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి చం ద్రబాబు నాయుడు తనపై గురుతర బాధ్యత పెట్టారన్నారు. రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లాలో టీడీపీని తిరు గులేని శక్తిగా తీర్చి దిద్దుతా నన్నారు. ఏడు నియోజక వర్గాల్లోని కూటమి నేతల ను సమన్వయం చేసుకుం టూ పార్టీని కంచుకోటగా మారుస్తానన్నారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, మంత్రు లు, ఎంపీ, సీనియర్‌ నాయకు లను కలిసి వారి సూచనలు, సలహాలతో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తానన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ప్రతినిధులు నూరుశాతం ఎన్నికయ్యేందుకు కృషి చేస్తామన్నారు. వారంలో రెండు, మూడు రోజులు అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తానన్నారు. ప్రజలు అవసరాలు తెలుసుకుని వారి అవసరాలు తీర్చినప్పుడే పార్టీకి బలం చేకూరుతుందన్నారు.

చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం

టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి ఎమ్మెల్యే బడేటి చంటి పాలాభిషేకం చేశారు. కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. నగర మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌, ఇడా చైర్మన్‌ పెద్దిబోయిన శివప్రసాద్‌, ఏఎంసీ చైర్మన్‌ పార్థసారథి, టీడీపీ నగర అధ్యక్షుడు చోడే వెంకటరత్నం, ఎస్‌ఎంఆర్‌ పెదబాబు, టీడీపీ సీనియర్‌ నేత చల్లా వెంకట సత్యవరప్రసాద్‌, రెడ్డి నాగరాజు, బెల్లకొండ కిశోర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 22 , 2025 | 12:39 AM