Share News

టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా బడేటి చంటి..!

ABN , Publish Date - Dec 17 , 2025 | 01:37 AM

ఐదు నెలల సుదీర్ఘ కసరత్తు అనంతరం ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి)ని వరించనుంది.

 టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా బడేటి చంటి..!
బడేటి చంటి

ఏలూరు, డిసెంబరు 16(ఆం ధ్రజ్యోతి):ఐదు నెలల సుదీర్ఘ కసరత్తు అనంతరం ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి)ని వరించనుంది. ఆయన పేరును పార్టీ అధిష్ఠానం దాదా పు ఖరారు చేసింది. ఈ నెల 18న అధికారికంగా ప్రకటన చేస్తుంది. ఈ పదవిని ఆశిస్తూ ప్రస్తుత అఽఽధ్యక్షుడు, ఆప్కాబ్‌ చైర్మన్‌ గన్ని వీరాంజనేయులు, ఎమ్మెల్యే బడేటి చంటి, రాష్ట్ర నాయకులు పెనుమర్తి రామ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి, బీసీ నాయకులు శ్యామ్‌ చంద్రశేషు ఆశిస్తూ దరఖాస్తులు చేశారు. అధిష్టానం ఐవీఆర్‌ఎస్‌, ఆపైన ఫోన్‌ల్లో అభిప్రాయ సేకరణ అనంతరం ఎట్టకేల కు బడేటి చంటి వైపు మొగ్గు చూపింది. బడేటి కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది. చంటి తాత బడేటి వెంకట్రామయ్య పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గాను, ఏలూరు మున్సిపల్‌ చైర్మన్‌గాను, జిల్లా బోర్డు చైర్మన్‌గా, 1938లో మద్రాసు కౌన్సిల్‌లో ఎమ్మెల్సీగా పనిచేశారు. ఆయనకు కేంద్రం రావుబహుదూర్‌ బిరుదును ప్రదానం చేసింది. చంటి తండ్రి శ్రీహరిరావు 1981–84 మధ్య మున్సిపల్‌ చైర్మన్‌గా పనిచేసిన సమయంలో పట్టణం లో ఎన్నో వసతులు కల్పించారు. శ్రీహరిరావుకు ముగ్గురు కుమారులు దివంగత మాజీ ఎమ్మెల్యే కోట రామారావు(బుజ్జి), వెయిట్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ రాష్ట్ర నేత వెంకట్రామయ్య, ఎమ్మెల్యే చంటి. బుజ్జి ఏలూరు మున్సిపాల్టీలో మూడు పర్యాయాలు వైస్‌ చైర్మన్‌గా, 2014లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019లో ఓటమిపాలైన తర్వాత అనారోగ్యంతో కన్ను మూశారు. తర్వాత ఏలూరు టీడీపీ పగ్గాలను అందుకున్న చంటి నియోజకవర్గంలో తనదైన ముద్ర వేసి 2024 ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆళ్ల నానిపై విజయం సాధించి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

పశ్చిమకు మంతెన రామరాజు

పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఏపీఐఐసీ చైర్మ న్‌, మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజు (రాంబాబు) రెండోసారి తిరిగి ఎన్నిక కానున్నారు.

Updated Date - Dec 17 , 2025 | 01:37 AM