కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్‌గా బాబ్జి బాధ్యతల స్వీకరణ
ABN , Publish Date - Aug 29 , 2025 | 12:30 AM
రాష్ట్ర భవన నిర్మాణ, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్‌గా తెలుగుదేశం తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వలవల బాబ్జి గురువారం బాధ్యతలు స్వీకరించారు.
తాడేపల్లిగూడెం, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి):రాష్ట్ర భవన నిర్మాణ, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్‌గా తెలుగుదేశం తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వలవల బాబ్జి గురువారం బాధ్యతలు స్వీకరించారు. తాడేపల్లిలోని భవన నిర్మాణ కార్మిక బోర్డ్ కార్యాలయ సమీపంలో వేదిక ఏర్పాటుచేశారు. నియోజక వర్గం నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు వె ళ్లారు. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, తోట సీతారామ లక్ష్మి, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తదితరుల సమక్షంలో బాబ్జి ప్రమాణ స్వీకారం చేశారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ కూటమి గెలుపులో బాబ్జి కృషి ఎనలేనిదని నేతలు కొనియాడారు. బాబ్జి కష్టాన్ని గుర్తించి సీఎం చంద్రబాబు గురుతర బాధ్యతలను అప్పగించారని తెలిపారు. ప్రతి కార్యకర్త పార్టీ కోసం అంకితభావంతో పనిచేయాలని పిలుపు నిచ్పారు. నర్సాపురం ఇన్‌ఛార్జ్ పొత్తూరి రామరాజు, రాష్ట్ర కార్యదర్శులు కోళ్ల నాగేశ్వరరావు, గొర్రెల శ్రీధర్, పార్టీ మండల అధ్యక్షులు పరిమి రవికుమార్, కిలపర్తి వెంకట్రావు, పట్టణ అధ్య క్షుడు పట్నాల రాంపండు, గంధం సతీష్, సబ్నివీసు కృష్ణమోహన్ తదితరులు బాబ్జికి శుభాకాంక్షలు తెలిపారు,