ప్రకృతి వ్యవసాయంతో అనేక ప్రయోజనాలు
ABN , Publish Date - May 03 , 2025 | 12:07 AM
ప్రకృతి వ్యవసాయంతో అనేక ప్రయోజనాలున్నాయని జిల్లా ప్రకృతి వ్యవసాయ మేనేజర్ వై.నూక రాజు తెలిపారు.
మొగల్తూరు, మే2(ఆంధ్రజ్యోతి): ప్రకృతి వ్యవసాయంతో అనేక ప్రయోజనాలున్నాయని జిల్లా ప్రకృతి వ్యవసాయ మేనేజర్ వై.నూక రాజు తెలిపారు. కుక్కులవారి తోటలో గ్రామస్థులు, రైతులకు అవగాహన కల్పిస్తూ శుక్రవారం నిర్వహించిన ర్యాలీ, సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కోఆర్డినేటర్ ఎం.అరుణ్ కుమారి మాట్లా డుతూ రసాయనిక, పురుగుమందులు వాడకంతో ఖర్చులు పెరుగు తాయని, భూమి కలుషితమవుతుందని, పండిన పంటలు ఆరోగ్యానికి హనికలిగిస్తాయన్నారు. ప్రతీ ఇంటి పెరటిలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకుని కూరగాయలు పెంచుకోవడం వల్ల ప్రయోజనాలు వివరిం చారు. ప్రకృతి వ్యవసాయానికి జీవామృతాలు తయారీపై రైతులకు అవగాహన కల్పించారు. డివిజన్ ఇన్‌చార్జ్ నరసింహరావు, మండల ఇన్‌చార్జ్ లక్ష్మీ కుమారి, సిబ్బంది, సంఘ సభ్యులు పాల్గొన్నారు.