స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయం
ABN , Publish Date - Sep 11 , 2025 | 12:07 AM
స్వచ్ఛంద సంస్థలు సమాజానికి అందిస్తున్న సేవలు అభినందనీయమని, ప్రభుత్వాలకు ప్రజలకు వారధిగా పని చేస్తున్నారని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్య దర్శి కె.రత్నప్రసాద్ అన్నారు.
ఏలూరు క్రైం, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): స్వచ్ఛంద సంస్థలు సమాజానికి అందిస్తున్న సేవలు అభినందనీయమని, ప్రభుత్వాలకు ప్రజలకు వారధిగా పని చేస్తున్నారని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్య దర్శి కె.రత్నప్రసాద్ అన్నారు. ఏలూరు జిల్లా కోర్టు ఆవరణలో న్యాయసేవాధికార సంస్థ భవనంలో బుధవారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని స్వచ్ఛంద సేవా సంస్థల కార్యకర్తలు, బాలలకు న్యాయ సేవాధికార సంస్థ నిర్వహించే కార్యకలాపాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. రత్నప్రసాద్ మాట్లాడు తూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు, అనాథలు, బాలలకు, విద్యార్థులకు, ఆర్థికంగా వెనుకబడిన పౌరులకు అందించే సేవలపై మరింత చైతన్యాన్ని ప్రజలకు కల్పించాలని సూచించారు. స్వచ్ఛంద సంస్థలు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఉచిత సేవలపై అవగాహన కార్యక్ర మాల్లో పాల్గొనాలని సూచించారు. డీసీపీవో సూర్యచక్రవేణి, సీడీపీవో తులసి, చైల్డ్‌రైట్స్ అడ్వకసీ ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకరరావు, జిల్లా కార్యదర్శి రవి, సోషల్ వర్కర్ మేతర అజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు.