విద్యుత్ ఆదాపై భీమవరం మునిసిపాల్టీకి పురస్కారం
ABN , Publish Date - Dec 20 , 2025 | 12:22 AM
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వెన్సీ అవార్డు (ఎస్‌ఈసీఏ) 2025 ఎంపికలో భీమవరం మునిసిపాల్టీకి సిల్వర్ అవార్డు ప్రకటించారు.
నేడు అవార్డు అందుకోనున్న కమిషనర్, ఎంఈలు
భీమవరం టౌన్, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి) : ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వెన్సీ అవార్డు (ఎస్‌ఈసీఏ) 2025 ఎంపికలో భీమవరం మునిసిపాల్టీకి సిల్వర్ అవార్డు ప్రకటించారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేష న్‌కు గోల్డ్ అవార్డు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలలో సర్వే చేసి ఈ అవార్డులను ప్రకటించారు. శుక్రవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పి.సంపత్ కుమార్, రీజినల్ డైరెక్టర్ కం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సీహెచ్ నాగ నరసింహారావులు అవార్డు వచ్చిన మునిసిపల్ కమిషనర్లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. శనివారం విజయవాడలో జరిగినే అవార్డుల ప్రధానోత్సవంలో విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్ చేతుల మీదుగా మునిసిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, మునిసిపల్ ఇంజనీర్ ఎం త్రినాథరావులు అవార్డులు అందుకోనున్నారు. 2022 నుంచి 2025 వరకు విద్యుత్ వినియోగాన్ని స్టేట్ ఎనర్జీ శాఖ అధికారులు సర్వే చేశారు. విద్యుత్ వినియోగంలో సంస్కరణల ద్వారా విద్యుత్‌ను ఆదా చేయడం వల్ల ఈ అవార్డు వచ్చిందని మునిసిపల్ కమిషనర్ తెలిపారు. మునిసిపల్ అధికారులు, ఉద్యోగులు కమిషనర్, ఎంఈలను శుక్రవారం ఘనంగా సత్కరించారు.