Share News

ఆటో కనిపిస్తే మాయం చేస్తాడు

ABN , Publish Date - Apr 23 , 2025 | 12:54 AM

ఇంటి ముందు ఆటో పార్క్‌చేసి ఉందంటే తెల్లారేసరికి మాయం చేస్తున్న మాయగాడిని తాడేపల్లిగూడెం పోలీసులు పట్టుకున్నారు.

ఆటో కనిపిస్తే మాయం చేస్తాడు
పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు

ఏడు ఆటోలతో నిందితుడిని పట్టుకున్న పోలీసులు

తాడేపల్లిగూడెం రూరల్‌ ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): ఇంటి ముందు ఆటో పార్క్‌చేసి ఉందంటే తెల్లారేసరికి మాయం చేస్తున్న మాయగాడిని తాడేపల్లిగూడెం పోలీసులు పట్టుకున్నారు. అతడి వద్ద రూ.14లక్షల విలువ చేసే 7 ఆటోలను స్వాదీనం చేసుకున్నారు. తాడేపల్లిగూడెం డీఎస్పీ ఎం విశ్వనాథ్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తాడేపల్లిగూడెంలో ఆటోల అపహరణ కేసులు నమోదవుతుండడంతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. తాడేపల్లిగూడెం మామిడితోటకు చెందిన ములగాల వెంకటేశ్వర రావును అదుపులోకి తీసుకుని విచారించారు. అతడు అపహరించిన ఏడు ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. ఆటోల చోరీ కేసులో కీలకంగా వ్యవహరించిన సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్సైలు బాదం శ్రీను, పి నాగరాజు, సిబ్బందిని డీ ఎస్పీ విశ్వనాథ్‌ అభినందించారు.

Updated Date - Apr 23 , 2025 | 12:54 AM