లెక్క తేలాల్సిందే..
ABN , Publish Date - Sep 17 , 2025 | 12:09 AM
స్థానిక సంస్థల నిర్వహణకు ప్రభుత్వ గ్రాంట్లు, నిధులు అత్యంత కీలకం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే నిధులకు సంబంధించి ఖర్చు చేసిన ప్రతీ పైసాకు లెక్క కచ్చితంగా చూపాలి.
స్థానిక సంస్థల నిధులకు ఆడిట్ అడ్డంకి
జిల్లాలో 35 శాతం పంచాయతీల్లో ఆడిట్
నవంబరు వరకు ఆడిటింగ్
అభ్యంతరాలుంటే నిధుల రాక ఆలస్యం
బిల్లులు సంబంధిత పోర్టల్స్‌లో అప్‌లోడ్ చేయాలి
స్థానిక సంస్థల నిర్వహణకు ప్రభుత్వ గ్రాంట్లు, నిధులు అత్యంత కీలకం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే నిధులకు సంబంధించి ఖర్చు చేసిన ప్రతీ పైసాకు లెక్క కచ్చితంగా చూపాలి. ఖర్చు చేసిన నిధులపై సకాలంలో ఆడిట్ చేయించాలి. నిధులు, అభివృద్ధి పనుల బిల్లులను నిర్దేశిత పోర్టర్‌లో అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. ఇవేమి పట్టనట్టు వ్యవహరిస్తే నిధుల విడుదలకు కొర్రీలు పడే అవకాశాలు ఎక్కువ.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
పంచాయతీరాజ్ వ్యవస్థలో పంచాయతీ, మండల పరిషత్, జడ్పీ విభాగాలతో పాటు, మునిసిపాల్టీలు, కార్పొరేషన్లు నిధుల ఖర్చుపై ఆడిట్ చేయించాల్సి ఉంటుంది. జిల్లాలో 27 మండలాల్లో 547 గ్రామ పంచాయతీలున్నాయి. గత ఏడాది పనుల నిర్వహణ, గ్రాంట్లకు సంబంధించి కేవలం 35 శాతమే ఆడిట్ చేయించారు. ఏటా పంచాయతీరాజ్, దేవాలయాలకు జిల్లా ఆడిట్ శాఖ అధికారి పర్యవేక్షణలో సహాయ ఆడిట్, ఇతర విభాగాల అధికారులు స్వయంగా ఆడి టింగ్ చేస్తారు. పంచాయతీలకు, 150 దేవాలయా లకు సంబంధించి ఆడిట్ ప్రారంభమై మూడో నెల గడుస్తోంది. సంబంధిత అధికారులు రానున్న నవం బరు వరకు మాత్రమే ఆడిట్ చేస్తారు. పాత బిల్లుల ను అప్‌డేట్ చేయించుకోవడం వలన 15వ ఆర్థిక సంఘం నిధుల నేరుగా కేంద్రం నుంచి ఆయా పం చాయతీలకు జమ అవుతాయి. ఈ నిధులు విడుద లలో ప్రధానమైనవి బేసిక్ నిధులు. వీటిని పూర్తి స్థాయిలో ఖర్చుపెట్టి సరైన లెక్క, పత్రాలతో నివేది కలు ఇస్తేనే పంచాయతీలు, స్థానిక సంస్థలకు పర్ఫార్మెన్స్ ఫండ్స్ (పనితీరు ఆధారం)గా రెండో విడత నిధులను కేంద్రం విడుదల చేస్తుంది. ఈ లోగా చేపట్టిన పనులకు బిల్లులను సంబంధిత ప్రభుత్వ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఆడిట్‌కు ముందుకు రావాలి
స్థానిక సంస్థల్లో ఆడిటింగ్ ప్రక్రియ జరుగు తోంది. ఇప్పటికే సగం కాలం గడిచిపోయింది. నవంబరు నెలాఖరకు వరకు గడువు ఇచ్చాం. సకా లంలో బిల్లుల, పత్రాలతో వచ్చి ఆడిట్ చేయించు కోవాలి. ఇబ్బందులుంటే ఫోన్ 9848779548 నెంబర్‌లో సంప్రదించవచ్చు.
ఆర్‌వీఆర్ గంగాధరరావు, జిల్లా ఆడిట్ అధికారి