అంతరిక్ష పరిశోధనలకు సహకరిస్తా
ABN , Publish Date - Aug 22 , 2025 | 12:36 AM
అమెరికాలోని ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్(టీఎస్‌ఐ)’ 2029లో నిర్వహించే అంతరిక్ష యాత్రకు ఎంపికైన పాలకొల్లుకు చెందిన జాహ్నవి దంగేటి(23) గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మను మర్యాద పూర్వకంగా కలిశారు.
భీమవరం టౌన్, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): అమెరికాలోని ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్(టీఎస్‌ఐ)’ 2029లో నిర్వహించే అంతరిక్ష యాత్రకు ఎంపికైన పాలకొల్లుకు చెందిన జాహ్నవి దంగేటి(23) గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మను మర్యాద పూర్వకంగా కలిశారు. జాతీయ అంతరిక్ష వారోత్సవాల సందర్భంగా వర్మ ను కలిసిన జాహ్నవి, తన భవిష్యత్ ప్రణా ళికలను వివరించారు. జాహ్నవి దేశానికి మరింత పేరు తీసుకొచ్చేందుకు అన్ని విధాలా ఆమె శిక్షణ, భవిష్యత్ అంతరిక్ష పరిశోధనలకు సహకరిస్తానని వర్మ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమెను సత్కరించి అభినందించారు.