Share News

ఆశా నియామకాలు

ABN , Publish Date - Jun 04 , 2025 | 12:36 AM

జాతీయ ఆరోగ్య పథకం (ఎన్‌ హెచ్‌ఎం)లో భాగంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాత్కాలిక ప్రాతిపదికన 55 ఆశా కార్యకర్తలను నియమించనున్నారు.

 ఆశా నియామకాలు

ఏలూరు అర్బన్‌, జూన్‌ 3 (ఆంధ్ర జ్యోతి): జాతీయ ఆరోగ్య పథకం (ఎన్‌ హెచ్‌ఎం)లో భాగంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాత్కాలిక ప్రాతిపదికన 55 ఆశా కార్యకర్తలను నియమించనున్నారు. అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తు న్నట్టు జిల్లా వైద్యాధికారి మాలిని తెలిపా రు. పీహెచ్‌సీల వారీగా ఖాళీల వివరాల ను జిల్లా వెబ్‌సైట్‌లో పొందుపర్చడంతో పాటు, సచివాలయాల నోటీసు బోర్డుల్లో ఉంచినట్లు వివరించారు. ఈ నెల 4నుంచి 10 వరకు సచివాలయాల వారీగా దరఖా స్తులను అందజేయాలని సూచించారు. సచివాలయాలకు అందిన దరఖాస్తులను గ్రామీణ ఆరోగ్య పారిశుధ్య, పౌష్టికాహార కమిటీ (వీహెచ్‌ఎస్‌ఎన్‌సీ) పరిశీలించి అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా 3 దరఖాస్తులను ఎంపికచేసి డీఎంహెచ్‌వో కార్యాలయానికి పంపిస్తుందని, జిల్లా హెల్త్‌ సొసైటీ(డీహెచ్‌ఎస్‌)ద్వారా తుది ఎంపికలు జరుగుతాయని వివరించారు.

Updated Date - Jun 04 , 2025 | 12:36 AM