Share News

ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైంది

ABN , Publish Date - Sep 16 , 2025 | 12:09 AM

ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైనదని ప్రముఖ పత్రిక సంపాదకులు సతీష్‌ చందర్‌ అన్నారు.

ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైంది
సమావేశంలో మాట్లాడుతున్న పత్రిక సంపాదకులు సతీష్‌ చందర్‌

తణుకు, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైనదని ప్రముఖ పత్రిక సంపాదకులు సతీష్‌ చందర్‌ అన్నారు. సామాజిక న్యాయపోరాట సమితి, తణుకు స్టడీ సర్కిల్‌, బ్లూవింగ్స్‌ ఫౌండేషన్‌ సంయు క్తంగా ‘ఓటు రక్షకులే ఓటు భక్షకులా’ అంశంపై ఆదివారం రాత్రి సమావేశం నిర్వహించారు. సతీష్‌ చందర్‌ మాట్లాడుతూ ఓటును రక్షించాల్సిన ప్రభుత్వ నేతలు భక్షకులుగా మారితే ప్రజాస్వామ్యం మనజాలదన్నారు. ఓటర్‌ను నేను బతికే ఉన్నానని నిరూపించుకో అనే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం కూలిపోయి నియంతృత్వ పోకడకడలు వస్తాయని బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ 1919లోనే పేర్కొన్నారన్నారు. మన ఓటు మనం రక్షించుకోవడమే పెద్ద పనిగా ఏర్పడిందని, మనం బతికే ఉన్నామని నిరూపిం చుకోవాల్సిన పరిస్థితులు ప్రభుత్వాలు కల్పించడం దురదృష్టకరమని చెప్పారు. ఎన్నికల కమిషన్‌ స్వయంప్రతిపత్తి గల వ్యవస్థ అని నిరూపించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక న్యాయపోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు పేరేరి మురళీకుమార్‌, గౌరవాధ్యక్షుడు గొల్లపల్లి అంబేడ్కర్‌, దారి దీపం సంపాదకులు డీవీవీఎస్‌.వర్మ, తణుకు స్టడీ సర్కిల్‌ డాక్టర్‌ బి.రమేష్‌చంద్రబాబు, సంకు మనోరమ, హైమావతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 16 , 2025 | 12:09 AM