Share News

ఆక్వా చెరువులకు రిజిస్ట్రేషన్‌ !

ABN , Publish Date - Sep 26 , 2025 | 12:18 AM

ఆక్వా సాగు చేయాలంటే ఇక రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి. ప్రభుత్వం రూపొందించిన ఆక్వా కల్చర్‌ యాప్‌లో తమ చెరువుల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ రాయితీలు రైతులు పొందాలంటే ఏపీఎస్‌ఏడీ యాక్ట్‌ 2020 చట్టం ద్వారా గుర్తింపు పొందిన చెరువు లకు మాత్రమే అందనున్నాయి.

ఆక్వా చెరువులకు రిజిస్ట్రేషన్‌ !

లేదంటే వర్తించని ప్రభుత్వ రాయితీలు

సచివాలయాల్లో ఆన్‌లైన్‌ నమోదు

ఆక్వాజోన్‌, నాన్‌ ఆక్వా జోన్‌లతో సంబంధం లేదు..

రైతులకు అవగాహన సదస్సులు

ఆక్వా సాగు చేయాలంటే ఇక రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి. ప్రభుత్వం రూపొందించిన ఆక్వా కల్చర్‌ యాప్‌లో తమ చెరువుల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ రాయితీలు రైతులు పొందాలంటే ఏపీఎస్‌ఏడీ యాక్ట్‌ 2020 చట్టం ద్వారా గుర్తింపు పొందిన చెరువు లకు మాత్రమే అందనున్నాయి.

నిడమర్రు, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): అమ రావతిలో ఈనెల 23వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు ఆక్వా రంగంపై చర్చించారు. ఒడిదుడుకులకు లోన వుతున్న ఆక్వా రంగం సుస్థిరత కోసం, నిర్ధిష్ట సమాచారం కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రణా ళికతో ముందుకెళ్లను న్నట్టు తెలిపారు. దీనికోసం ఆక్వా జోన్‌, నాన్‌ ఆక్వా జోన్‌లలో సాగు చేస్తున్న ప్రతి చెరువు ప్రభు త్వ గుర్తింపు పొందాలని, దీనికోసం నెల రోజులు సమయం తీసుకొని రైతులకు అవ గాహన కల్పిం చి చెరువుల రిజిస్ట్రేషన్లు నమోదు చేయించాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలననుసరించి కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి ఆక్వా రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆక్వా రైతులు ప్రతి రైతు తమ చెరువుకు గుర్తింపు రిజిస్ట్రేషన్‌ తప్పని సరిగా చేసు కోవాలన్నారు. ప్రభుత్వం ద్వారా విద్యుత్‌ సబ్సిడీ పొందడానికి (యూనిట్‌ రూ.1.50) ఈ గుర్తింపు ఉండాలన్నారు. ప్రతి సచివాలయంలో మత్స్య సిబ్బందితో ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియ చేప డుతు న్నామని, రైతులు ఈ అవకాశం సద్వినియో గించు కుని ప్రభుత్వ రాయితీలు పొందాలన్నారు.

రిజిస్ట్రేషన్ల కోసం..

ఆక్వా చెరువుల రైతులు తమ చెరువులకు సంబంధించి రైతు పట్టాదారు పాస్‌బుక్‌ జిరాక్స్‌, పొలం అడంగళ్‌ కాపీ – 1బి కాపీ, రైతు ఆధార్‌ కార్డు, రూ 10 స్టాంప్‌ పేపర్‌తో కూడిన అఫిడవిట్‌, ఎకరాకు రూ.వెయ్యి రుసుము, చెరువుకు సంబం ధించి ఆటోకాడ్‌ మ్యాప్‌ (దీనిని ఫిషరీస్‌ సిబ్బంది జతపరుస్తారు)తో ఆన్‌లైన్‌ యాప్‌లో వివరాలు అప్‌లోడ్‌ చేసిన వెంటనే అప్లికేషన్‌ జెనరేట్‌ అవు తుంది. దీనిని డౌన్‌లోడ్‌ చేసుకొని రైతు సంతకం చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలి. వారం రోజుల లోపు రిజిస్ట్రేషన్‌ నెంబ ర్‌ ఇస్తారు. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఆక్వా డెవలప్‌మెంట్‌ బోర్డు సర్టిఫికెట్‌ (ఏపీ ఎస్‌ఏడీ యాక్ట్‌– 2020) ఉన్నవారికి రిజిస్ట్రేషన్‌ అవసరం లేదని మత్స్య శాఖ అధికారులు చెబుతున్నారు.

రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి

ప్రతి రైతుకు ఆక్వా రాయితీలు అందాలనే సదుద్దేశ్యంతో ఆక్వా చెరువుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభించాం. ఏపీఎస్‌ఏడీ చట్టం 2020 పరిధిలోకి ప్రతి రైతును తీసుకొచ్చి ప్రభుత్వ రాయితీ ఫలాలు అందించడానికి ఈ రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి. గతంలో కంటే భిన్నంగా ఆక్వాజోన్‌, నాన్‌ఆక్వా జోన్‌లతో సంబంధం లేకుండా మీసేవ సర్టిఫికెట్‌ ఉన్నవారు, పాత లైసెన్స్‌ ఉన్నవారు ఈ రిజిస్ట్రేష న్‌లో నమోదు చేసుకోచ్చు. రిజిస్ట్రేషన్‌ కోసం ఆక్వా రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిసున్నాం. 30 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలనే లక్ష్యంతో సచివాలయాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నాం.

బి.నరసయ్య, జిల్లా మత్స్యశాఖాధికారి

ఆక్వా రంగం అభివృద్ధికి దోహదం

ప్రభుత్వం ఆక్వా రంగాన్ని ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో సాగుచేస్తున్న ప్రతి చెరువును రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించింది. దీనివల్ల వాస్తవంగా ఎన్ని ఎకరాలు సాగులో ఉందో అంచనా వస్తుంది. రాబోయే కాలంలో ఆక్వా రంగంలో ప్రభుత్వం ఇచ్చే విద్యుత్‌ మొదలైన సబ్సిడీలు పొందడం కోసం రిజిస్ట్రేషన్లు తప్పనిసరిగా చేసుకోవాలి. ఆక్వా రంగం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం నడుం బిగించడం శుభపరిణామం.

– సంకు నాగశేషు, ఆక్వా రైతు, బువ్వనపల్లి

Updated Date - Sep 26 , 2025 | 12:18 AM