Share News

అప్సడా.. ఆపసోపాలు!

ABN , Publish Date - Dec 20 , 2025 | 12:41 AM

ఆక్వా రం గంలో ప్రభుత్వ రాయితీలు రావాలన్నా ఆక్వా పరి శ్రమకు మరిన్ని ప్రోత్సాహకాలు అందాలన్నా ప్రభు త్వం నూతనంగా తీసుకొచ్చిన అప్సడా అనుమతు లు తప్పనిసరి.

అప్సడా.. ఆపసోపాలు!

అడ్డంకిగా సాంకేతిక సమస్యలు

వేధిస్తున్న 22ఏ – ఆధార్‌ అనుసంధానం

విద్యుత్‌ రాయితీలకు తప్పనిసరి

కైకలూరు, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి):ఆక్వా రం గంలో ప్రభుత్వ రాయితీలు రావాలన్నా ఆక్వా పరి శ్రమకు మరిన్ని ప్రోత్సాహకాలు అందాలన్నా ప్రభు త్వం నూతనంగా తీసుకొచ్చిన అప్సడా అనుమతు లు తప్పనిసరి. ఈ విషయంలో రైతులు వెనుకబడి వున్నారు. అధికారుల అలసత్వమో, రైతుల నిర్లక్ష్య మో తెలియదు కాని 50 శాతం మంది రైతులు నేటికీ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోలేదు.

అప్సడా అనుమతులు పొందితేనే ఆక్వా చెరువు లకు విద్యుత్‌, ఇతర ప్రభుత్వ రాయితీలు వస్తా యని నాలుగు నెలలుగా అధికారులు, ప్రజా ప్రతి నిధులు చెబుతున్నా రైతుల్లో నిర్లక్ష్యం, సాంకే తిక ఇబ్బందులు, ఆక్వా, నాన్‌ ఆక్వాజోన్‌ వంటి సమస్య లతో పూర్తిస్థాయిలో అనుమతులు పొంద లేకపోతు న్నారు. ఆక్వా చెరువుకు విద్యుత్‌ రాయితీ కావాలం టే అనుమతులు తప్పనిసరి చేశారు. రాష్ట్రంలో 4.28 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగు తోంది. ఏలూరు జిల్లాలో 1.49 లక్షల ఎకరాలు, పశ్చిమ గోదావరిలో 1.30 లక్షల ఎకరాలు, కృష్ణాలో 1.09 లక్షల ఎకరాలు, నెల్లూరులో 40 వేల ఎకరాల్లో సాగు జరుగుతోంది. అయితే అప్సడా అనుమతుల కోసం ఇప్పటివరకు దరఖాస్తు చేసిన 2.14 లక్షల ఎకరాలకు మాత్రమే అనుమతులు మంజూరయ్యా యి. మరో 2.14 లక్షల ఎకరాలకు అనుమతులు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉందని మత్స్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

కారణాలెన్నో..

అప్సడా అనుమతులపై అవగాహన కల్పిస్తూ జిల్లాస్థాయిలో అధికారులు సభలు, సమావేశాలు నిర్వహించినా క్షేత్రస్థాయిలో రైతులు ముందుకు రాకపోవడంతో 50 శాతం మాత్రమే అనుమతులు మంజూరయ్యాయి. రైతు చెరువుకు ఆధార్‌ లింకు కాకపోవడం, వెబ్‌ల్యాండ్‌ చేయకపోవడం, లీజుకు ఇవ్వడం, లీజుదారుల చేతిలో ఉండడం, పట్టాదారు పాసుబుక్‌ ఆధార్‌కు అనుసంధానం కాకపోవడం, ఒక చెరువులో నలుగురు రైతులుంటే ఇద్దరు లేదా ముగ్గురు రైతుల ఆధార్‌ అనుసంధానం అయితే మరో రైతుకు కాకపోవడంతో అనుమతులు మంజూరు కావడం లేదు. అప్సడా అనుమతు లుంటే విద్యుత్‌ యూనిట్‌ రూ.1.50లకే వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అనుమతులు లేని రైతులు డీజిల్‌ ఇంజన్లపై, జనరేటర్లపై ఆధారపడి సాగు చేయడం వల్ల ఎకరానికి రూ.30 వేల నుంచి రూ.50 వేలు అదనపు పెట్టుబడులు పెట్టాల్సి వస్తోంది. విద్యుత్‌ కనెక్షన్‌ ఉన్నప్పటికీ అప్సడా అనుమతులు లేని రైతులకు యూనిట్‌కు రూ.9 నుంచి రూ.10లు చార్జి పడడంతో రూ.వేలల్లో ఎకరానికి రైతు నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది.

జిల్లాల వారీగా వివరాలు

ఏలూరుజిల్లాలో 1.49 లక్షల ఎకరాలకు ఇప్పటివరకు 80 వేల ఎకరాలకు అనుమతులు మంజూరయ్యాయి. మరో 69 వేల ఎకరాలకు మంజూరు కావాల్సి వుంది. ఇందులో ఒక్క కలిదిండి మండలంలోనే ఎనిమిదివేల ఎకరాలకు పైచిలుకు డీఫారమ్‌ పట్టాలు ఉండడం, నాన్‌ ఆక్వాజోన్‌లో చూపించడంతో పాటు ఈ చెరువులన్నీ 22ఏలో ఉండడం వల్ల అనుమతులు మంజూరుకు రైతులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 1.32 వేల ఎకరాలకు 72 వేల ఎకరాలకు అనుమతి మంజూరు కాగా 60వేల ఎకరాలకు దరఖాస్తు చేసుకోవాల్సివుంది. ఇందులో 30 వేల ఎకరాలు ఢీఫారమ్‌ పట్టాలు ఉండడం ఈ ఆక్వా చెరువులన్నీ నాన్‌ ఆక్వాజోన్‌లో ఉండడం 22ఏ లో పెట్టడడంతో అనుమతులు మంజూరు కావడం లేదు. కృష్ణా జిల్లాలో 1.09లక్షల ఎకరాలకు 30,500 ఎకరాలకు అనుమతులు మంజూరు కాగా 71 వేల ఎకరాలకు వివిధ సమస్యలతో అనుమతులు మంజూరు కాలేదు. నెల్లూరులో 40 వేల ఆక్వా చెరువులకు 28 వేల ఎకరాలకు మంజూరు కాగా మరో 12 వేలు ఎకరాలకు దరఖాస్తులు రాలేదు.

గ్రామస్థాయిలో సమావేశాలు నిర్వహించాలి...

అప్సడా అనుమతులకు కొంతమంది రైతులు ముం దుకు రాకపోవడంతో గ్రామస్థాయిలో రెవెన్యూ, మత్స్యశాఖ అధికారులు రైతు సమస్యను గ్రామస్థాయిలో పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. చిన్న, సన్న కారు రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరి గేందుకు సుముఖత చూపకపోవడంతో క్షేత్ర స్థాయిలో ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తే సమస్య లు పరిష్కారమై మరింత మంది రైతులకు ప్రభుత్వ రాయితీలు వర్తించేందుకు అనువుగా ఉంటుందనే భావన వ్యక్తమవుతోంది.

Updated Date - Dec 20 , 2025 | 12:41 AM