Share News

ఆర్థిక శాఖ వద్ద అప్రోచ్‌ ఫైల్‌

ABN , Publish Date - Dec 11 , 2025 | 12:18 AM

భీమవరం నియోజకవర్గానికి యనమదుర్రు పై వంతెనలు దశాబ్దాల కల. ఎమ్మెల్యే అంజి బాబు హయాంలో 13 ఏళ్ల క్రితం మూడింటిని పూర్తి చేసినా అప్రోచ్‌లను నిర్మించలేదు.

ఆర్థిక శాఖ వద్ద అప్రోచ్‌ ఫైల్‌

భీమవరంలో మూడు వంతెనలకు అప్రోచ్‌ల నిర్మాణానికి రూ.32 కోట్లు

నిధులు విడుదలైతే నెరవేరనున్న దశాబ్దాల కల.. గ్రామాలు అభివృద్ధి

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

భీమవరం నియోజకవర్గానికి యనమదుర్రు పై వంతెనలు దశాబ్దాల కల. ఎమ్మెల్యే అంజి బాబు హయాంలో 13 ఏళ్ల క్రితం మూడింటిని పూర్తి చేసినా అప్రోచ్‌లను నిర్మించలేదు. ఫలి తంగా ఇవి ఉత్సవ విగ్రహాలుగా మిగిలాయి. భీమవరం రూరల్‌ మండలం యనమదుర్రు డ్రెయిన్‌కు రెండు వైపులావున్న ఎదురెదురు గ్రామాలకు వెళ్లి రావాలంటే పట్టణం మీదుగా కిలోమీటర్లు ప్రయాణించి చేరుకోవాలి. వైసీపీ హయాంలో ఎన్నికల ముందు మాట వరుసకు జగన్‌మోహన్‌రెడ్డి అప్రోచ్‌ వంతెనల కు నిధులు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. కాని, అమలుకు నోచుకోలేదు. కూటమి అధికా రంలోకి వచ్చిన తర్వాత వీటి నిర్మాణాలకు నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే అంజిబాబు అసెంబ్లీలో ప్రస్తావించారు. ఇటీవల నిర్వహించి న కలెక్టర్ల సదస్సుల్లో ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి కలెక్టర్‌ నాగరాణి తీసుకు వెళ్లారు. మూడు అప్రోచ్‌లకు రూ.32 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. సాంకేతిక అనుమ తులు వచ్చినప్పటికి ఆర్థిక శాఖ వద్ద ప్రతిపా దనలు పెండింగ్‌లో ఉన్నాయి. అక్కడ అను మతులు ఇస్తే టెండర్లు పిలుస్తారు. ఆర్థికశాఖ అనుమతి కోసం ఇప్పుడంతా ఎదురు చూస్తున్నారు. ‘అప్రోచ్‌ వంతెనలకు ఆర్థిక శాఖ అనుమ తులు ఇస్తుంది. నిధులు వచ్చిన వెం టనే వీటిని పూర్తిచేస్తాం. రూరల్‌ మండల ప్రజ ల ఆకాంక్షను నెరవేరుస్తాం.’ అని ఎమ్మెల్యే అంజిబాబు స్పష్టం చేశారు.

Updated Date - Dec 11 , 2025 | 12:18 AM