దరఖాస్తుల జోరు
ABN , Publish Date - Dec 25 , 2025 | 12:56 AM
జిల్లాలో పేదలు ఆక్రమించుకున్న స్థలాలు, ఇళ్లను క్రమబద్ధీకరించుకు నేందుకు భారీగానే దరఖాస్తులు పోటెత్తాయి.
వచ్చినవి 504.. తిరస్కరణకు గురైనవి 314
మరో 60 దరఖాస్తుల క్రమబద్ధీకరణకు
జిల్లా కమిటీ అంగీకారం
ఈనెల 31తో ఆక్రమణల రెగ్యులరైజేషన్ క్లోజ్
గడువు పెంచే యోచనలో ప్రభుత్వం
(ఏలూరు–ఆంధ్రజ్యోతి):
జిల్లాలో పేదలు ఆక్రమించుకున్న స్థలాలు, ఇళ్లను క్రమబద్ధీకరించుకు నేందుకు భారీగానే దరఖాస్తులు పోటెత్తాయి. ఆక్రమణ స్థలాల్లో నివాసం ఉంటున్న పేద లకు జీవో నెంబర్ 30 ద్వారా రెగ్యులరైజేషన్ చేసుకోవ డానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం అవకాశం కల్పించింది. 75 గజాల లోపు స్థలాలను ఉచితంగా క్రమబద్ధీకరణ చేసుకోవడానికి వెసులుబాటు కల్పించింది. అంతకంటే ఎక్కువ స్థలం ఉంటే మార్కెట్ రేటు ప్రకారం ఆయా సంస్థల ద్వారా చెల్లించి వారి సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తూ దరఖాస్తులను ఆహ్వానించింది. దర ఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం విధించిన గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ దిశగా ప్రచారం కల్పించ డంలో యంత్రాంగం పట్టింపులేమి విమర్శలకు తావిస్తోంది.
భారీగా దరఖాస్తులు.. తిరస్కరణలు
జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు రెవెన్యూ డివిజన్ల పరిధిలో మొత్తం 504 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఏలూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో 113, జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలో 313, నూజీవీడు డివిజన్ పరిధిలో 78 దరఖాస్తులు అందాయి. అయితే ఇందులో సరైన డాక్యుమెంట్లు, వివరాలను పొందుపర్చకపోవడం వల్ల అధికారుల స్థాయిలోనే 314 దరఖాస్తులను తిరస్కరించారు. మరో 60 దరఖాస్తులు క్రమబద్ధీకరణకు జిల్లా కమిటీ అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలో పది దరఖాస్తులు ఆర్డీవో స్థాయిలోను, మరో మూడు మండల స్థాయిలో పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం పరిశీలనలో 99 దరఖాస్తులు న్నాయి. జాయింట్ కలెక్టర్ స్థాయిలో 9 దరఖాస్తుల వరకు పరిశీలనలో ఉన్నాయి. జిల్లా రెగ్యులరైజేషన్ కమిటీ స్థాయిలో 9 దర ఖాస్తులను పరిష్కరించాల్సి ఉంది. మిగి
ఎప్పటికి పరిష్కారం అయ్యేనో?
దరఖాస్తుల స్వీకరణ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. కాగా ఇప్పటి వరకు జిల్లా యంత్రాంగానికి అందిన దరఖాస్తులకు ఎప్పటికి మోక్షం కల్పిస్తారో తె లియని పరిస్థితి. జీవో ఇచ్చిన ప్రభుత్వం వాటిని పరిష్కరించే విషయంలో చొరవ తీసుకోలేదని చెబుతున్నారు. ఇప్పటి వరకు జీవో నెంబర్ 30 కింద ఎన్ని పరిష్కరించారన్నది ఆరా తీయకపోవడంతో పెండింగ్‌లోను దరఖాస్తులు ఉండి పోయినట్లు చెబుతున్నారు. కింద స్థాయిలో తిరస్కరించిన దరఖాస్తులకు సంబంధించి ఆయా దరఖాస్తుదారులు పూర్తి వివరాలను సమర్పించే దిశగా వారిని దిశా నిర్థేశనం చేయలేదని చెప్పాలి. అయితే ఆక్రమణల క్రమబద్దీకరణ జీవో విషయంలో దరఖాస్తు గడువు పెంచే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.