Share News

3న నీట్‌ – పీజీ

ABN , Publish Date - Jul 30 , 2025 | 12:31 AM

వైద్య విద్య పోస్టుగ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఆగస్టు 3న నిర్వహించనున్న నీట్‌–పీజీ పరీక్షకు ఏలూరు జిల్లాలో కేంద్రాలు ఖరారయ్యాయి.

3న నీట్‌ – పీజీ

ఏలూరులో రెండు పరీక్ష కేంద్రాలు

ఏలూరు అర్బన్‌, జూలై 29(ఆంధ్రజ్యోతి): వైద్య విద్య పోస్టుగ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఆగస్టు 3న నిర్వహించనున్న నీట్‌–పీజీ పరీక్షకు ఏలూరు జిల్లాలో కేంద్రాలు ఖరారయ్యాయి. వట్లూరు సీఆర్‌ఆర్‌ ఇంజనీ రింగ్‌ కళాశాల కేంద్రానికి 200 మంది, సిద్ధార్థ క్వెస్ట్‌ కేంద్రానికి 178 మంది అభ్యర్థులను కేటాయించారు. ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించే పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతుంది. పరీక్ష కేంద్రాల్లోకి అభ్యర్థులను ఉదయం 7గంటల నుంచే అనుమతిస్తారు. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఆధ్వర్యంలో నిర్వహించే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు కేంద్రాల ప్రధాన ప్రవేశ ద్వారాలను పరీక్ష ప్రారంభ సమయానికి అరగంట ముందే మూసివేస్తారు. ఈ నిబంధన నీట్‌–పీజీకి వర్తింపజేసే విషయంపై మంగళవారం సాయంత్రం వరకు స్పష్టత లేదు. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సిటీ ఇన్ఫర్మేషన్‌ను ఇప్పటికే పంపిన ఎన్‌టీఏ సంబంధిత పరీక్ష కేంద్రాల సమాచారాన్ని ఈ నెల 31న జారీచేసే హాల్‌టిక్కెట్లలో మాత్రమే పొందు పరిచేలా చర్యలు తీసుకుంది. అభ్యర్థులకు కేటాయిం చిన పరీక్ష కేంద్రానికి హాల్‌టిక్కెట్‌తోపాటు, ఫోటో గుర్తింపుకార్డు, ట్రాన్స్‌ఫరెంట్‌ వాటర్‌ బాటిల్‌ తీసుకెళ్లాలి. నిబంధనలను హాల్‌టిక్కెట్‌పై ముద్రిస్తారు.

Updated Date - Jul 30 , 2025 | 12:31 AM