Share News

పొగాకుతో క్యాన్సర్‌ ముప్పు

ABN , Publish Date - Jun 01 , 2025 | 12:03 AM

పొగ తాగడం ఆరోగ్యానికి హానికరమని, హెచ్చరిక లను చాలా మంది పెడచెవిన పెట్టి ప్రమాదం కొని తెచ్చుకుంటున్నారని జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్‌ గీతాబాయి అన్నారు.

పొగాకుతో క్యాన్సర్‌ ముప్పు
భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిజ్ఞ చేయిస్తున్న వైద్యశాఖ ఉద్యోగులు

ధూమపానం అలవాటుకు దూరంగా ఉండాలి

వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం

భీమవరం క్రైం, మే 31 (ఆంధ్రజ్యోతి): పొగ తాగడం ఆరోగ్యానికి హానికరమని, హెచ్చరికలను చాలా మంది పెడచెవిన పెట్టి ప్రమాదం కొని తెచ్చుకుంటున్నారని జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్‌ గీతాబాయి అన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా భీమవరం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం పొగాకు అలవాటు విడనాడాలని ప్రతిజ్ఞ చేయించారు. ఏటా మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం నిర్వహిస్తున్నారని జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్‌ గీతాబాయి వివిరించారు. వాస్తవానికి ప్రపంచంలో పొగాకును ద్వేషించేవారు చాలా తక్కువగా ఉన్నారన్నారు. అదొక ఆనవాయితీగా పొగ పీలుస్తూ వారి ఆరోగ్యానికే చేటు కాకుండా పక్కవారికి కూడా అనారోగ్యం దరిచేరేలా వ్యవహరిస్తున్నారన్నారు. చిన్న పిల్ల లు, గర్భిణులపై తీవ్ర ప్రభావం పడుతుందన్నా రు. అనంతరం ఎన్‌సీడీ పీవో డాక్టర్‌ ధనలక్ష్మి, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మాధవీ కల్యాణి మాట్లాడుతూ పొగాకు వ్యతిరేక దినం నిర్వహించే రోజు మాత్రమే కాకుండా ఏడాది పొడవునా పొగాకు మాన్పించేలా అందరూ చర్యలు తీసుకోవాలని సూచించారు. ర్యాలీలో లిపిడో యోమియోలజిస్ట్‌ సుభాష్‌, డాక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ డాక్టర్‌ గోవిందబాబు, డాక్టర్‌ రాంబాబు, అధికారులు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 01 , 2025 | 12:03 AM