Share News

అన్నదాత సుఖీభవ నిధులు విడుదల

ABN , Publish Date - Nov 19 , 2025 | 12:24 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అన్నదాత సుఖీభవ పథకంలో ఈ ఏడాది రెండో విడత కింద రైతులకు సాయం అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్త య్యాయి.

అన్నదాత సుఖీభవ నిధులు విడుదల

జిల్లా వ్యాప్తంగా లబ్ధిపొందే రైతులు 1,60,968.. మొత్తం రూ. 106.23 కోట్లు

అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు రూ.5 వేలు, పీఎం కిసాన్‌ కింద రూ.2వేలు

నేటి నుంచి రైతుల బ్యాంకు ఖాతాలకు రెండో విడత సొమ్ములు

ఏలూరుసిటీ, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అన్నదాత సుఖీభవ పథకంలో ఈ ఏడాది రెండో విడత కింద రైతులకు సాయం అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్త య్యాయి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఈ పథకం కింద గత ఆగస్టు రెండో తేదీన రైతులకు సాయం అందించగా.. తాజాగా మూడో నెలలో అంటే నవంబరు 19న బుఽధవారం రెండో విడత రైతులకు పెట్టుబడి సాయం అందించేం దుకు సర్వం సిద్ధమైంది. ఈ నిధులలో అన్నదాత సుఖీభవ కింద రెండో విడతగా రూ.5వేలు, పీఎం కిసాన్‌ కింద 21వ విడత సొమ్ములు రూ.2వేలను కలిపి మొత్తం రూ.7వేలను రైతుల భ్యాంకు ఖాతాల్లో చేరనున్నాయి.

జిల్లాలో లక్షా 60 వేల 968 మంది రైతులకు ఈ సాయం అందనుంది. ఈ పథకం కింద రూ. 8,048 కోట్లు, పీఎం కిసాన్‌ పథకం కింద రూ. 25.75 కోట్లు నిధులు కేటాయించగా ఈ రెండు పథకాలకు సంబంధించి జిల్లా మొత్తం ఎంపిక చేసిన 1,60,968 మంది రైతులకు మొత్తం రూ. 106.23 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేస్తారు. ఇదిలా ఉండగా అన్నదాత–పీఎం కిసాన్‌ కింద తొలి విడతలో 7 వేల రూపాయలు, రెండో విడతలో 7వేల రూపాయలు, మూడో విడతలో 6 వేలు రూపాయలు కలిపి మొత్తం రూ.20 వేల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అర్హులైన రైతులకు అందజేస్తుంది. తాజాగా రెండో విడత అందించే సాయంతో రైతులకు ఈ ఏడాది అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్‌ కింద మొత్తం రూ.14 వేలు అందించినట్టవుతుంది. ఈ నగదు జమ వల్ల రైతులకు పెట్టుబడి సాయం అందడంతో పాటు అర్హులైన రైతులందరికీ ప్రయోజనం చేకూరనుంది.

రైతులకు ఊరట ..

అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్‌ సొమ్ములు బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత నిధులు విడుదల చేయడంతో రైతులకు ఊరట కలిగింది. ఏడాదికి అన్నదాత సుఖీభవ కింద రూ.14 వేలు, పీఎం కిసాన్‌ కింద రూ.6వేలు కలిపి మొత్తం రూ.20 వేలు ఒక్కొక్క రైతు కుటుంబానికి అందించను న్నారు. కౌలు రైతులకు మాత్రం ప్రభుత్వమే నేరుగా అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేల పెట్టుబడి సాయం అందించనున్నారు. రాబోయే రోజుల్లో కౌలు రైతులకు ఈ పెట్టుబడి సాయం అందిస్తారని తెలుస్తోంది.

గత ప్రభుత్వ హయాంలో..

గత ప్రభుత్వ హయాంలో రైతు భరోసా కింద పీఎం కిసాన్‌ నిధులతో కలిపి ప్రతి ఏటా రైతులకు రూ.13,500 (రైతు భరోసా రూ.7,500, పీఎం కిసాన్‌ రూ.6వేలు) కొంతమంది రైతులకు మాత్రమే అందించారు.

Updated Date - Nov 19 , 2025 | 12:24 AM