Share News

రండి.. అంగన్‌వాడీ పిలుస్తోంది

ABN , Publish Date - Jun 12 , 2025 | 12:43 AM

మూడేళ్లు నిండిన చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రవేశాల కల్పనకు..ఐదేళ్లు పూర్తి చేసుకు న్న పిల్లలను ప్రభుత్వ ప్రాఽఽథమిక పాఠశాలల్లో చేర్పించే లక్ష్యంతో ‘రండి.. అంగన్‌వాడీ పిలుస్తోంది’ కార్యక్రమానికి తెలుగుదేశం ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

రండి.. అంగన్‌వాడీ పిలుస్తోంది

నేటి నుంచి మూడేళ్లు దాటిన పిల్లలకు ప్రవేశాలు.. ఏర్పాట్లు పూర్తి

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

మూడేళ్లు నిండిన చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రవేశాల కల్పనకు..ఐదేళ్లు పూర్తి చేసుకు న్న పిల్లలను ప్రభుత్వ ప్రాఽఽథమిక పాఠశాలల్లో చేర్పించే లక్ష్యంతో ‘రండి.. అంగన్‌వాడీ పిలుస్తోంది’ కార్యక్రమానికి తెలుగుదేశం ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బడులతో పాటు సమాంతరంగా అంగన్‌ వాడీల్లో పిల్లలను కొత్తగా చేర్చుకుని వారికి సా మూహిక అక్షరాభ్యాసాలకు ఐసీడీఎస్‌ అధికారులు ఏర్పాట్లు చేశారు. గురువారం నుంచే ఈ ప్రక్రియ ప్రారంభించనున్నారు. జిల్లాలో 2,215 అంగన్‌వాడీ కేంద్రాలుండగా అందులో వివిధ వయస్సుల పిల్ల లు లక్ష వరకు ఉంటారు. ఇందులో ప్రీ స్కూల్‌కు 10వేల లోపు మంది వెళ్లే అవకాశం ఉంది. కొత్త వారు ఎంతమంది చేరతారనే అంశాలపై సెంటర్ల వారీగా సీడీపీవోలు ఆరా తీస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెలాఖరు వరకు ప్రత్యేక కార్యాచరణతో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు ముందుకు సాగుతారు. అన్ని కేంద్రాల పరిధిలో విస్తృత అవగాహన కార్యక్రమాలను ప్రచారం చేయనున్నారు. ఐసీడీఎస్‌, ఆరోగ్య, గ్రామవార్డు సచివాలయాల ఎంఎస్‌కే వంటి శాఖల సమ న్వయంతో ప్రచారానికి అడుగులు వేస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చేరడం వల్ల ఏమేమి ప్రయోజనాలు, విద్యాబోధన వంటి వాటిని విశదీకరిస్తారు. కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా అంగన్‌ వాడీల్లో ఐదేళ్ల వయస్సు దాటిన వారికి గ్రాడ్యుయేషన్‌ డేలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్దేశించింది.

Updated Date - Jun 12 , 2025 | 12:43 AM