Share News

అమృత్‌ 2.0 కొత్తగా..

ABN , Publish Date - Sep 03 , 2025 | 12:57 AM

జిల్లాలోని పట్టణాలకు విజ్జేశ్వరం నుంచి గోదావరి నీటిని అందించే పైప్‌లైన్‌ ప్రాజెక్ట్‌లకు కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రభుత్వానికి నివేదించారు. గతంలో టెండర్‌లు పిలిచినా కాంట్రాక్టర్‌ల నుంచి స్పందన లేదు. మరోవైపు ధరలు పెరిగాయి. దాని ఆధారంగా అమృత్‌ 2.0 పైప్‌లైన్‌ ప్రాజెక్ట్‌ వ్యయాన్ని పెంచారు.

అమృత్‌ 2.0 కొత్తగా..

రీటెండర్‌లకు సిద్ధమవుతున్న ప్రభుత్వం

తొలివిడత స్పందన కరువు

ధరల పెంపు..పనుల కుదింపు

పాత నిధులతోనే పనులకు ప్రణాళిక

ఏజన్సీలతో సంప్రదింపులు

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

జిల్లాలోని పట్టణాలకు విజ్జేశ్వరం నుంచి గోదావరి నీటిని అందించే పైప్‌లైన్‌ ప్రాజెక్ట్‌లకు కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రభుత్వానికి నివేదించారు. గతంలో టెండర్‌లు పిలిచినా కాంట్రాక్టర్‌ల నుంచి స్పందన లేదు. మరోవైపు ధరలు పెరిగాయి. దాని ఆధారంగా అమృత్‌ 2.0 పైప్‌లైన్‌ ప్రాజెక్ట్‌ వ్యయాన్ని పెంచారు. అయితే కేంద్రం నుంచి నిధులు అధికంగా వచ్చే అవకాశం లేదు. పాత నిధులతోనే సరి పెట్టుకోవాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. అందుకు తగ్గట్టుగానే జిల్లా అధికారులు కసరత్తు పూర్తి చేశారు. చిన్నపాటి పనుల్లో కోత విధించారు. గతంలో మంజూరు చేసిన నిధులకే ప్రాజెక్ట్‌ను సిద్ధం చేశారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. జిల్లాలో భీమవరం, తణుకు, పాలకొల్లు, నర్సాపురం, ఆకివీడు పట్టణాలకు నేరుగా గోదావరి జలాలను మళ్లించాలని ప్రభుత్వం సంకల్పించింది. కాలు వలు కాలుష్యమయం కావడంతో గోదావరి జల్లాలను నేరుగా పట్టణాల్లోని చెరువులకు, నీటి శుద్ధిప్లాంట్‌ లకు మళ్లించా లని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తొలి దశ టెండర్‌లకు కాంట్రాక్టర్‌లు స్పందించలేదు. ఫలితంగా ప్రభుత్వమే ఏజన్సీలతో సంప్రదింపులు జరుపుతోంది. మరోవైపు ప్రాజెక్ట్‌ వ్యయాన్ని పెంచింది. ఈసారి టెండర్‌లు వేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మరికొద్ది రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది. అధికారులు ప్రభుత్వం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర స్థాయిలోనే మరోసారి టెండర్‌లు పిలవనున్నారు.

గూడెంలో మరో సమస్య

తాడేపల్లిగూడెంలో మంచినీటి సమస్యను అధిగమించేందుకు పంపుల చెరువు వద్ద ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ నిర్మిస్తున్నారు. రెండో సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ నిర్మిస్తుండడంతో పైప్‌లైన్‌ ప్రాజెక్ట్‌లో తాడేపల్లిగూడెం లేదు. అయితే పట్టణ ప్రజలకు సమృద్ధిగా నీరు ఇవ్వాలని నీటి శుద్ధిప్లాంట్‌కు గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. నిర్మాణం చేపట్టింది.కానీ బిల్లులు మంజూరు చేయలేదు. కాంట్రా క్టర్‌కు దాదాపు రూ. 3.50 కోట్లు చెల్లించాలి. బిల్లులు ఇస్తేనే ప్లాంట్‌ నిర్మాణం చేపడతా మంటూ కాంట్రాక్టర్‌ చేతులేత్తేశాడు. ఎమ్మెల్యే బొలిశెట్టి కాంట్రాక్టర్‌తో నేరుగా సంప్ర దింపులు జరిపారు. బిల్లులు ఇప్పించా లంటూ కాంట్రాక్టర్‌లు స్పష్టం చేశారు. పనులు ఇప్పటికీ ముందుకు సాగడం లేదు. దీనివల్ల పట్టణంలో మంచి నీటి సమస్య ఎదురవుతోంది. రెండు పూటలా విద్యుత్‌ కోత విధిస్తున్నారు. బిల్లులు మంజూరైతే నీటి శుద్ధిప్లాంట్‌కు పరి ష్కారం లభిస్తుంది.

అమృత్‌ 2.0లో కొత్త ప్రతిపాదనలు

నిధులు రూ.కోట్లలో

భీమవరం 167.72

నర్సాపురం 125.92

పాలకొల్లు 119.26

తణుకు 118.11

ఆకివీడు 76.34

Updated Date - Sep 03 , 2025 | 12:57 AM