Share News

మార్కెట్‌ మాటేమైంది!

ABN , Publish Date - Jul 10 , 2025 | 12:14 AM

ఏడాది కాలంగా ఎదురుచూపులు. రేపు, మాపు అంటూ ఊరిస్తూనే వచ్చారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా మార్కెట్‌ కమిటీల నియామకంలో భారీ జాప్యం. ఎమ్మె ల్యేలు ఎటూ తేల్చుకోలేక, సిఫార్సులో స్పష్టత కొరవడి అది కాస్త స్థానిక నేతలకు అసంతృప్తి మిగిలిచ్చింది.

 మార్కెట్‌ మాటేమైంది!

మార్కెట్‌ కమిటీల నియామకంలో జాప్యం

ఏడాది గడిచినా ఇంకా నాన్చివేత

పార్టీ సీనియర్ల పడిగాపులు

ఎమ్మెల్యేలు సిఫార్సు చేసినా ఇంకా పెండింగే

కేడర్‌లో అసంతృప్తి రాగాలు

త్వరలోనే జాబితాలు రెడీ అంటూ మరోసారి సంకేతాలు

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

ఏడాది కాలంగా ఎదురుచూపులు. రేపు, మాపు అంటూ ఊరిస్తూనే వచ్చారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా మార్కెట్‌ కమిటీల నియామకంలో భారీ జాప్యం. ఎమ్మె ల్యేలు ఎటూ తేల్చుకోలేక, సిఫార్సులో స్పష్టత కొరవడి అది కాస్త స్థానిక నేతలకు అసంతృప్తి మిగిలిచ్చింది. దేవాలయ కమిటీల్లో చోటు కోసం ప్రయత్నిస్తున్న వారిది ఇదే తీరు. ఇప్పటికే రెండు విడతలు మార్కెట్‌ కమిటీలను ప్రకటించారు. దేవాలయాలకు ఇప్పటివరకు తొలి జాబితా కూడా ప్రకటించలేదు. ఈనెల రెండో వారంలోనైనా ఈ నామినేటెడ్‌ జాబితాలు వెలువడుతాయని ఎదురుచూస్తున్నారు.

నియోజకవర్గాల్లో పార్టీ విజయానికి చెమటో డ్చిన వారికి ప్రాధాన్యత కల్పించేలా మార్కెట్‌ కమిటీల చైర్మన్లుగా నామినేట్‌ చేసేవారు. దీర్ఘకాలికంగా ఈ ప్రక్రియ సాగుతూనే ఉంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మార్కెట్‌ చైర్మన్లుగా ప్రకటించడంలో జాప్యం చోటుచేసుకుంది. జిల్లాలో నూజివీడు, చింతల పూడి మార్కెట్‌ కమిటీలకు ఆది నుంచి జాప్యం ఎదురవుతోంది. తెలుగుదేశం అధికారంలో ఉన్న వైసీపీ రాజ్యమేలినా ఈ రెండుచోట్ల మార్కెట్‌ కమిటీల చైర్మన్లు నియామకంలో ఆలస్యమే తొంగి చూస్తోంది. చింతలపూడి మార్కెట్‌ కమి టీ 2014–19 మఽధ్యన ఒక్క దఫా కూడా అధి కారికంగా ప్రకటించలేకపోయారు. చైర్మన్‌ పదవి కోసం అత్యధికులు పోటీపడడం ఒకెత్త యితే అప్పట్లో మంత్రిగా ఉన్న పీతల సుజాత ఎటూ తేల్చుకోలేకపోయారు. చివరి ఆర్నేళ్లలోపే ఎవరి నో ఒకరిని నియమించి మమ అనిపించారు. ఎస్సీ రిజర్వుడ్‌ నియోజకవర్గం కావడంతో సాధ్యమైనంత మేర మిగతా వర్గాలే ఈ పదవికి పెద్దఎత్తున పోటీపడేవారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మార్కె ట్‌ కమిటీల్లో సామాజిక వర్గాల కోటా మేరకు నియామకం జరిగేలా చూసింది. చైర్మన్‌తో సహా డైరెక్టర్ల పదవులకు ఇదే పద్ధతిని ముడిపెట్టింది. తిరిగి టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈసారి కూడా జిల్లాలో దెందులూరు, ఏలూరు, ఉంగుటూరు మార్కెట్‌ కమిటీలకు చైర్మన్‌, పాలకవర్గాన్ని నామినేట్‌ చేశారు. చింతలపూడి మార్కెట్‌ కమిటీకి ఒకరిద్దరి పేర్లు పరిశీలనలోకి వచ్చినా అధికారికంగా నామినేట్‌ జరగకపోవ డం చింతలపూడిలో కాస్తా అసంతృప్తే మిగి ల్చింది. పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతీసారి ఇదే జరుగుతుందని సీనియర్లు ఆగ్రహంతో ఉన్నారు. నూజివీడులోను ఇలాంటి సీనే కొన సాగుతోంది. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవి ఎస్సీలకు రిజర్వ్‌ అయ్యింది. మంత్రి కొలుసు పార్థసారఽథి ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ చైర్మన్‌ ఎవరనేది ఇప్పటి వరకు ప్రకటించలేకపోయారు. గత ఐదేళ్లలోనే చైర్మన్‌ పదవికి ఎవరికి అప్పగించాలనే విష యం ఒక కొలిక్కి రాకపోవడం అప్పటి వైసీపీ మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప అప్పారావు ఎటూ తేల్చుకోలేక చివరి ఆర్నేళ్లలోనే ఎన్నికల ముందు ప్రకటించారు. ఇప్పుడదే ఆన వాయితీని కొనసాగిస్తారా.. లేదా ఈసారైనా ప్రకటిస్తారా అనేది సందేహంగానే ఉంది.

మార్కెట్‌ కమిటీల్లో జాప్యమెందుకు ?

మార్కెట్‌ కమిటీల ప్రకటనలో జరుగుతున్న జాప్యంపై కూటమిలోనూ భిన్నాభిప్రాయాలున్నాయి. జిల్లా వ్యాప్తంగా తొమ్మిది మార్కెట్‌ కమిటీలుండగా, వీటిలో చింతలపూడి, భీమడోలు, కైకలూరు, కలిదిండి, నూజివీడు కమిటీలను ఇప్పటివరకు ప్రకటించలేదు. కైకలూరు నియోజకవర్గంలో రెండింటికి ఎమ్మెల్యే డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ ఇప్పటికే సిఫార్సులు చేశారు. అయితే ప్రభుత్వ పరంగా క్లియరెన్స్‌ ఇవ్వలేదు. సాధ్యమైనంత మేర కూటమి పక్షాన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే అభీష్టం మేరకే కమిటీలను ప్రకటించాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే కమిటీల్లో చైర్మన్‌ పదవులు, డైరెక్టర్‌ పదవులు కూటమిలో భాగస్వామ్య పక్షాలకు చెందిన వారితో సమతూకంగా నియమించాలని కీలక నిర్ణయం కూడా జరిగింది. అయినా కమిటీలను నామినేటేడ్‌ చేయడంలో ప్రభుత్వ పరంగానే ఆలస్యం జరుగుతోంది. ఈ నెల రెండో వారం లేదా ఆ తర్వాత సాధ్యమైనంత మేర మార్కెట్‌ కమిటీలను రాష్ట్రవ్యాప్తంగా సంపూర్ణంగా నామినేటేడ్‌ చేయబోతున్నట్టు చెబుతున్నారు.

Updated Date - Jul 10 , 2025 | 12:14 AM