Share News

భీమవరం, పెనుగొండ ఏఎంసీలకు పాలక వర్గాలు

ABN , Publish Date - Aug 10 , 2025 | 12:46 AM

భీమవరం, పెనుగొండ వ్యవసాయ మా ర్కెట్‌ కమిటీలకు పాలకవర్గాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిం ది.

భీమవరం, పెనుగొండ ఏఎంసీలకు పాలక వర్గాలు

భీమవరం, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): భీమవరం, పెనుగొండ వ్యవసాయ మా ర్కెట్‌ కమిటీలకు పాలకవర్గాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిం ది. భీమవరం ఏఎంసీ గౌరవ చైర్మన్‌గా పబ్లిక్‌ అకౌంట్స్‌ చైర్మన్‌ పులపర్తి అంజి బాబు, చైర్మన్‌గా కలిదిండి సుజాత, వైస్‌ చైర్మన్‌గా బండి రమేష్‌కుమార్‌, డైరెక్టర్‌లు గా మైగాపుల గంగారావు, రొంగల కృష్ణ వేణి, గూడూరి దేవిజ్యోతి, ఎద్దు కంఠ మణి, బండి రాజేష్‌, మోకా శ్రీను, నేల పాటి ఆంబోజి, యర్రంశెట్టి సత్యవీర బ్రహ్మం, యిర్రింకి సుధా రత్నకుమారి, కిల్లంపూడి రమాదేవి, మహమ్మద్‌ ఖలీల్‌, యాతం నాగలక్ష్మిలను నియమించారు.

పెనుగొండ మార్కెట్‌ కమిటీకి గౌరవ చైర్మన్‌గా ఎమ్మెల్యే పితాని సత్యనారా యణ, చైర్మన్‌గా బడేటి వీరబ్రహ్మం, వైస్‌ చైర్మన్‌గా శీలం బాబి భాస్కర్‌, డైరెక్టర్‌లు గా బొరుసు దుర్గా కల్యాణి, చింతపల్లి జేమ్స్‌, చిట్టూరి మంగ, దాసరి శ్రీనివాస్‌, శానబోయిన నోరి సోమ గంగా శంకర్‌ ప్రకాశ్‌, బండారు వెంకట కృష్ణ, వంగూరి రామకృష్ణారావు, మల్లిపూడి కమలా కుమారి, బొక్కా పావని, తేతలి అనురాధ, శాన బోయిన యుగంధర్‌ ఫణి రామదాసు, చిటికెన తాతారావులను నియమించారు.

Updated Date - Aug 10 , 2025 | 12:46 AM