రైతుల కోసమే ప్రభుత్వం
ABN , Publish Date - May 24 , 2025 | 12:36 AM
రైతు పండించిన పంటకు మద్దతు ధర కల్పించడమే కాకుం డా వారి బాగోగులపై తక్షణం స్పందిస్తున్నామని వ్యవసాయ శాఖా మంత్రి కె.అచ్చెన్నాయుడు తెలిపారు.
ఏలూరులో కోకో రైతుల సమావేశం
సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి
కొనుగోళ్లకు కంపెనీల అంగీకారం
మంత్రి అచ్చెన్నాయుడు
రైతులకు ఏ ఇబ్బంది వచ్చినా తక్షణం పరిష్కరిస్తున్నాం. వారి బాగోగులపై శ్రద్ధ పెట్టాం. ఏ పంట పండించినా సరే రైతు ఇబ్బంది పడకుండా అధికారులను రంగంలోకి దింపుతున్నాం. ప్రభుత్వమే నేరుగా కదిలి వచ్చి పరిష్కారం చూపుతుంది. కోకో రైతుల కష్టాలను తీరుస్తాం. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు చర్యలు చేపడతామని వ్యవసాయ శాఖా మంత్రి కె.అచ్చెన్నాయుడు అన్నారు.
ఏలూరు, మే 23(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రైతు పండించిన పంటకు మద్దతు ధర కల్పించడమే కాకుం డా వారి బాగోగులపై తక్షణం స్పందిస్తున్నామని వ్యవ సాయ శాఖా మంత్రి కె.అచ్చెన్నాయుడు తెలిపారు. కోకో రైతుల సమస్యలపై శుక్రవారం ఏలూరు కలెక్టరేట్‌లో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. కోకో కొనుగోలుపై ఒక నిర్ణయం తీసుకున్నామని, మద్యస్థ ధర ఉండేలా కంపెనీలతో మాట్లాడినట్లు తెలిపారు. కంపెనీలు రూ.450 ధరకే కొనుగోలు చేస్తామని చెప్పినప్పటికి మరో రూ.50 ప్రభుత్వం భరించి సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు. రైతుల వద్ద ఉన్న కోకో గింజలను రూ.500 ధరకు కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో కోకో ఆధారిత ఉత్పత్తులు తగ్గడంతో సమస్య ఏర్ప డిందన్నారు. భవిష్యత్తులో కోకోకు కూడా ఒక చట్టం తెచ్చే యోచనలో ఉందన్నారు. కోకో పంట నాణ్యతపై రైతులకు శిక్షణ ఇచ్చే ప్రయత్నాలు చేస్తామన్నారు.
కోకో పంటకు ధర ఇవ్వడంలో ట్రేడర్లు కంపెనీలు విఫలమవుతున్నాయని మంత్రి పార్థసారథి అన్నారు.దళారి వ్యవస్థ లేకుండా కంపెనీలకు నేరుగా రైతులు కోకో గింజలు విక్రయించేలా చర్యలు తీసుకోవాల న్నారు. కోకో పంటకు గత ఏడాది, ప్రస్తుత ధరకు చాలా వ్యత్యాసం ఉండటంతో ధర నిర్ణయంపై కంపెనీలు నిర్ధిష్ట విధానం అవలంబించాలన్నారు.
కోకో రైతుల సమస్యలు తెలిసిన వెంటనే స్పందిం చాం. రైతులు, ట్రేడర్‌లు, కంపెనీలతో ప్రత్యేకంగా సమావేశం కావడం శుభపరిణామమని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. సమస్య పరిష్కరించేందుకు కృషి చేసిన మంత్రులకు ధన్యవాదాలు
గత ఏడాది కోకో కిలో రూ.900 పైగా ధర పలికిందని, ప్రస్తుతం రూ.300–రూ.400 ఉందని రైతు వెంకటేశ్వరరావు అన్నారు. కొనుగోలులో కంపెనీలు రైతులకు ఎన్నో షరతులు పెడుతున్నాయి. తేమ శాతం, పంగస్ పేరుతో తక్కువ ధరకు కొంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చర్యలు తీసుకో వాలని కోరారు. సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్, ఉద్యాన వనశాఖ డైరెక్టర్ శ్రీనివాస్, కలెక్టర్ వెట్రి సెల్వి, జేసీ ధాత్రిరెడ్డి, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్, కామినేని శ్రీనివాస్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాషా, రైతు సంఘం నాయకులు శ్రీనివాస్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.