Share News

ఖరీఫ్‌ ప్రణాళిక రెడీ

ABN , Publish Date - May 29 , 2025 | 12:26 AM

జిల్లాలో ఖరీఫ్‌ సాగు ప్రణాళికను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. 2,22,347 ఎకరాల్లో వరి సాగు చేపట్టాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.

ఖరీఫ్‌ ప్రణాళిక రెడీ

జిల్లాలో 2,22,347 ఎకరాల్లో వరి సాగు

11,117 ఎకరాల్లో వరి నారుమడులు

10,721 క్వింటాళ్ల విత్తనాలు అవసరం

ఏలూరు సిటీ, మే 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఖరీఫ్‌ సాగు ప్రణాళికను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. 2,22,347 ఎకరాల్లో వరి సాగు చేపట్టాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. 11,117 ఎకరాల్లో వరి నారుమళ్లు వేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. కొన్ని ప్రాంతా ల్లో రైతులు భూమి దుక్కి దున్ని ఖరీఫ్‌ సాగు కు సమాయత్తం అవుతున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల బోర్ల కింద, వర్షాధార ప్రాంతాల్లో నారు మడులు వేశారు. ఖరీఫ్‌లో స్వర్ణ, ఎంటీయూ 1318, 1061, 7029, 5204, 1061, 1126, 1121 రకాలను ఎక్కువగా సాగు చేస్తారు. 10,721 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని అంచనా కాగా ప్రస్తుతం 5,100 క్వింటా ళ్ల విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని ప్రణాళికలో పేర్కొన్నారు. సబ్సిడీపై వరి విత్తనాలు, పచ్చి రొట్ట, ఎరువు లు ఇవ్వడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

సిద్ధంగా ఎరువులు

ఖరీప్‌కు ఎరువులు సిద్ధంగా ఉంచామని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 1,18,402 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరం అవుతా యని అంచనా వేయగా 49,435 మెట్రిక్‌ టన్నులు సిద్ధంగా ఉంచారు. మార్క్‌ఫెడ్‌ గొడౌ న్‌లో 7,221 మెట్రిక్‌ టన్నులు బఫర్‌ స్టాక్‌ ఉంది. సహకార సంఘాల వద్ద 7,507 మెట్రిక్‌ టన్నులు, రైతు సేవా కేంద్రాల వద్ద 27 మెట్రిక్‌ టన్నులు, ప్రైవేటు, హోల్‌ సేల్‌ డీలర్ల వద్ద 34,680 మెట్రిక్‌ టన్నుల ఎరువులు నిల్వలు ఉన్నట్టు ప్రణాళికలో పేర్కొన్నారు.

దిగుబడి లక్ష్యం 7.15 లక్షల మెట్రిక్‌ టన్నులు

జిల్లాలో ఖరీఫ్‌ సాగుకు సంబంధించి 7.15 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశాలున్నాయని అంచనా. ప్రకృతి సహ కరిస్తే దిగుబడి పెరిగే అవకాశాలున్నా యని చెబుతున్నారు. నారుమడులు జూన్‌ మొదటి, రెండు వారాల్లో ప్రారంభమవుతాయని జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఎస్‌కే హబీబ్‌ బాషా తెలిపారు.

Updated Date - May 30 , 2025 | 03:06 PM