Share News

పీఆర్‌ 126పై నీలినీడలు!

ABN , Publish Date - Nov 22 , 2025 | 12:01 AM

పంజాబ్‌ వెరైటీ రకం పీఆర్‌ 126 వరి ప్రతికూల వాతావరణాన్ని, తెగుళ్లను తట్టుకు ంటుంది. ఆశించిన దిగుబడినిస్తుంది.

పీఆర్‌ 126పై నీలినీడలు!

సాగు చేయవద్దంటున్న వ్యవసాయాధికారులు

అధిక దిగుబడులు..సాగుకు రైతుల మొగ్గు

పెదవేగి/ఏలూరు సిటీ, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): పంజాబ్‌ వెరైటీ రకం పీఆర్‌ 126 వరి ప్రతికూల వాతావరణాన్ని, తెగుళ్లను తట్టుకు ంటుంది. ఆశించిన దిగుబడినిస్తుంది. మిగిలిన వాటికంటే త్వరగా కోతకొస్తుంది. దీంతో చాలా మంది రైతులు రబీలోను పీఆర్‌ 126 రకం సాగు కు మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ రకం ధాన్యం నాణ్యత తక్కువగా ఉంటుందని, గింజ ముక్కలుగా అవుతుందని, ఎగుమతికి అడ్డంకిగా ఉందని ఈ రకం సాగుకు మొగ్గు చూపవద్దని మరోవైపు వ్యవసాయశాఖ చెబుతున్నారు.

ఏలూరు జిల్లాలోని ఉంగుటూరు, భీమడోలు, పెదవేగి మండలాల్లో ఖరీఫ్‌లో 951 ఎకరాల్లో ఈ పీఆర్‌ 126 రకం విత్తనం సాగు అయిందని, రబీ సీజన్‌ నుంచి ఈ వరి రకాన్ని సాగు చేయకుండా ముందస్తుగానే చర్యలు చేపడుతున్నట్టు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇది రాష్ట్రీయ వరి వంగడం కాకపోవడంతో ప్రభుత్వం ఈ వరి రకానికి సబ్సిడీ ఇవ్వడం లేదని చెబుతు న్నారు.వచ్చే రబీ సీజన్‌ నుంచి పీఆర్‌ 126 రకం పండించవద్దని జిల్లా వ్యవసాయ శాఖ చెబుతోం ది. ఇది మన ప్రాంతం రకం కాదని, దానికి ప్రత్యా మ్నాయంగా ఉన్న ఎంటీయూ 1121 1282, 1293, 1426 రకాలను సాగు చేయాలని సూచిస్తున్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో ఇతర రాష్ట్రాల నుంచి పీఆర్‌ 126 రకం విత్తనం తీసుకువచ్చి సాగు చేశారని, ప్రస్తుతం పండించిన పంటను ధా న్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు చేస్తారని చెబుతున్నారు. అయితే ఈ రకం పంటకు ఎగుమతులు లేకపో వడంతో సాగు చేయవద్దని అధికారు లు విజ్ఞప్తి చేస్తున్నారు.

అధికారులు స్పష్టతనివ్వాలి

పీఆర్‌ 126 రకం సాగుతో ఆర్థికంగా మెరుగైన ఆదాయం ఉంటుందని, తెగుళ్లను తట్టుకుని, తక్కు వ సమయంలో కోతకు వస్తుందని రైతులు చెబు తున్నారు. అధికారులు ఈ రకం వంగడం ఎగు మతికి అనుకూలంగా లేదని, సాగు చేయవద్దని సూచిస్తున్నారని, ఈ విషయంలో పూర్తిస్థాయిలో స్పష్టత నివ్వాలని రైతులు కోరుతున్నారు. ఈ విష యమై ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌ రైతులతో కలిసి సోమ వారం జరిగిన పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు వినతి అందించారు. ఖరీఫ్‌లో ఎక్కువశాతం మంది పీఆర్‌ 126 రకం సాగు చేశామని, రబీలో ఈ రకం సాగు వద్దని ఇప్పుడు చెబుతున్నారని, ఇప్ప టికే విత్తనాలను సిద్ధం చేసుకున్నామని వాపోతు న్నారు. ఇప్పటికిప్పుడు మరోరకం విత్తనాన్ని సేక రించడానికి సమయం సరిపోదని రైతులు ఆవే దన వ్యక్తం చేస్తున్నారు.

పీఆర్‌ 126 వద్దని సూచిస్తున్నాం

‘రబీలో పీఆర్‌ 126 రకం సాగు చేపట్టవద్దని రైతులకు సూచిస్తున్నాం. దిగుబడి పరంగా పీఆర్‌ 126 మిగిలిన వాటి కంటే మెరుగ్గా ఉంటుంది. ప్రతికూల వాతావరణంలోనూ తట్టుకుని నిలబడుతుంది. దీంతో రైతులు ఈ రకం సాగుకు మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ రకం ధాన్యం ముక్కలు అయి ఎగుమతులకు అడ్డంకిగా మారుతోంది. ప్రత్యామ్నాయ వంగడాలపై రైతులు దృష్టి సారించాలి’

– అనిల్‌కుమారి, వ్యవసాయశాఖ

ఏలూరు సహాయ సంచాలకురాలు

Updated Date - Nov 22 , 2025 | 12:01 AM