Share News

భూమి.. చెరువైంది!

ABN , Publish Date - Aug 03 , 2025 | 12:34 AM

మండలంలో ధాన్యాగారంగా పేరొందిన రామన్నపాలెం పేరు చెబితే పచ్చని వ్యవసాయ భూములు, చేలగట్లపై కొబ్బరి ఫలసాయంతో ఉండే అడవిపర్ర గుర్తు వస్తుంది.

భూమి.. చెరువైంది!
చెరువులుగా తవ్వేస్తున్న వ్యవసాయ భూములు

దర్భరేవు డ్రెయిన్‌ ముంచేస్తోంది

చేలను తవ్వేసిన రైతులు

ఆక్వా చెరువులుగా మార్చేశారు

అడవిపర్ర ఆయకట్టు దుస్థితి

మండలంలో ధాన్యాగారంగా పేరొందిన రామన్నపాలెం పేరు చెబితే పచ్చని వ్యవసాయ భూములు, చేలగట్లపై కొబ్బరి ఫలసాయంతో ఉండే అడవిపర్ర గుర్తు వస్తుంది. ఇపుడు చేలు చెరువులు అవుతున్నాయి. కొబ్బరి చెట్లు కొట్టేస్తున్నారు. పంట భూములను ఆక్వా చెరువులుగా మార్చేస్తున్నారు. అడవిపర్ర ఆయకట్టు పరిధిలో 800 ఎకరాల వరి సాగు ఉండేది. ప్రస్తుతం ఆక్వా కల్చర్‌ కనిపిస్తుంది. దర్భరేవు డ్రెయిన్‌ ముంపు వరి సాగును కబళించేసింది. ఏటా ముంపు నష్టం తట్టుకోలేని రైతుల గుండె, వ్యవసాయ భూమి చెరువైంది..

మొగల్తూరు, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): తీర ప్రాంతమైన మొగల్తూరు మండలంలో రామన్నపాలెం అడవిపర్ర రైతులను పెద్ద రైతులుగా భావించేవారు. ఇక్కడ చేలకు కంత తీస్తే సాగునీరు అందే పరిస్ధితితో పాటు తక్కువ పెట్టుబడితోనే ఆశాజనకంగా వరి దిగుబడి వచ్చేంది. ఫలితంగా ఇక్కడ ఎకరం వరి చేను ఉంటే ఆకుటుంబానికి లోటు ఉండేదికాదు. వరి సాగుకు ఎంతో క్రేజ్‌ కలిగిన ఈ అడవిపర్ర చేలన్ని ప్రస్తుతం చేపల చెరువులుగా మారుతున్నాయి.

దర్భరేవు డ్రెయిన్‌ ముంపు..

అడవిపర్ర చేలల్లో ముంపునీరు లాగే దర్భరేవు డ్రెయిన్‌ పూడుకుపోవడంతో సము ద్రం ఆటుపోటుతో డ్రెయిన్‌ చేలను ముంచు తోంది. కొద్దిపాటి వర్షానికే చేలల్లో నీరు లాగక సాగు చేసిన చేలు కుళ్లిపోవడం, దిగుబడి ప్రభావం చూపడం, ముంపుతో సాగు ఖర్చులు పెరిగిపోవడంతో రైతులు సాగు చేసి తీవ్రంగా నష్టపోతున్నారు. సుమారు 15 ఏళ్లు గా దర్భరేవు డ్రెయిన్‌ ప్రక్షాళన చేయాలని రైతులు ఆందోళనలు, క్రాప్‌ హలీడే ప్రకటిం చినా అధికారులు, ప్రజాప్రతినిధులు డ్రెయిన్‌ ప్రక్షాళన వైపు కన్నెత్తి చూడలేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆయ కట్టు రైతులు కాళ్లరిగేలా ప్రతినిధుల చుట్టూ తిరిగినా ఫలితం కానరాలేదు. సుమారు 10 సంవత్సరాలుగా సాగు చేయకపోవడంతో అడ విపర్ర చేలు కొనేనాథుడు లేక ధరలు పడి పోయాయి. తమకు గల చేలను ఏదోరకంగా ఆదాయ మార్గంలోకి తీసుకురావాలని కొంద రు రైతులు అడవిపర్ర ఆక్వాజోన్‌ పరిధిలోకి రాకపోయినా తమ భూములను చేపల చెరువులకు లీజుకు ఇచ్చేస్తున్నారు. ఫలితంగా 800 ఎకరాల వరి సాగు చేలల్లో సుమారు 400 నుండి 500 ఎకరాలు ఇప్పటికే చేపల చెరువులుగా తవ్వేశారు. ప్రతీ గ్రామంలో వరి చేలు ధరలు ప్రతీ ఏటా పెరుతున్నా ఒక్కడ మాత్రం ఎకరం భూమి రూ.25లక్షలకు కొనేనాఽథుడు లేక పెరగడం లేదు. ఒకప్పటి ధాన్యాగారం అడవిపర్రలో భూమి ధరలు తగ్గడంపై రైతులు ఆవేదన చెందుతున్నారు.

దర్భరేవు డ్రెయిన్‌ ముంపు కారణం

దర్భరేవు డ్రెయిన్‌ పూడుకుపోవడంతో పాటు ఆటు పోటుల ప్రభావంతో డ్రెయిన్‌ పొంగి చేలు మునుగుతున్నాయి. ప్రభు త్వం, అధికారులు నిర్లక్ష్యం చేయడంతో రైతులు చేపల చెరువులకు లీజుకు ఇచ్చేస్తున్నారు.

– యాతం పాండురంగారావు, అడవిపర్ర రైతు

ఆక్వా జోన్‌ పరిధిలోకి తేవాలి

ముంపుతో నష్టాలు భరించలేక భూములు చేపల చెరువులకు లీజుకు ఇచ్చేస్తున్నారు. దర్భరేవు డ్రెయిన్‌ ప్రక్షాళన చేయలేని పరిస్థితిలో అడవిపర్ర ప్రాంతా న్ని ఆక్వా జోన్‌ పరిధిలోకి తీసుకువస్తే రైతులకు మేలు.

– ఎం.పుల్లయ్య నాయుడు, సాగునీటి సంఘ ఉపాధ్యక్షుడు

Updated Date - Aug 03 , 2025 | 12:34 AM