మాకు న్యాయం చేయండి
ABN , Publish Date - Jul 22 , 2025 | 12:30 AM
పోల వరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా ముంపునకు గురవుతున్న గ్రామాలను గుర్తించే విషయంలో అధికారులు చేస్తున్న పొరపాట్ల కారణంగా తాము తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిం దని 41వ కాంటూరులో ముంపునకు గురయ్యే గ్రామాలను 45వ కాంటూరులో చేర్చి తీవ్ర అన్యాయం చేశారని ఆరోపిస్తూ సోమవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాల యాన్ని ఐదు గ్రామాల ప్రజలు ముట్ట డించా రు.
వేలేరుపాడు తహసీల్దార్ కార్యాలయం ముట్టడి
వేలేరుపాడు, జూలై 21(ఆంధ్రజ్యోతి): పోల వరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా ముంపునకు గురవుతున్న గ్రామాలను గుర్తించే విషయంలో అధికారులు చేస్తున్న పొరపాట్ల కారణంగా తాము తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిం దని 41వ కాంటూరులో ముంపునకు గురయ్యే గ్రామాలను 45వ కాంటూరులో చేర్చి తీవ్ర అన్యాయం చేశారని ఆరోపిస్తూ సోమవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాల యాన్ని ఐదు గ్రామాల ప్రజలు ముట్ట డించా రు. గతంలో వచ్చిన సాధారణ వరదలకే సుద్దగుంపు, తాట్కూరుగొమ్ముకాలనీ, నిడిమి గొమ్ముకాలనీ, ఎర్రబోరు, తాతాపోచిరాల తది తర గ్రామాలు మునిగి తీవ్రనష్టం కలి గిందన్నా రు. తమ గ్రామాలను 41వ కాంటూరులో కలిపి పోలవరం నష్టపరిహారాలు అందించాలని జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులను కలిసి గోడు వెల్లిబుచ్చుకున్న తమను పట్టించుకోవడంలేద న్నారు. తొలుత సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్,సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా పార్టీల ఆధ్వర్యంలో అఖిల పక్షం వందలాది మంది నిర్వాసితులతో అంబే డ్కర్ సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించి కార్యాలయం ముట్టడించారు. డీటీ సురేంద్రకు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందించారు. అఖిలపక్షం తరపున సీపీఐ నుంచి ఎండీ మున్నీర్, కారం దారయ్య, బాడిస రాము, గంగరాజు, సీపీఎం నుంచి ధర్ముల రమేశ్, మడిమి దుర్గారావు, కాంగ్రెస్ నుంచి సత్తిపండు, వలగాని తమ్మయ్య, ఇబ్రహీం, సీపీఐఎంఎల్ ప్రజాపంథా నుంచి సిరికొండ రామారావు, ముత్యాలరావు, గిరిజన సంఘం నుంచి బంధం ప్రసాద్, ముతత్యాలు, ఐదుగ్రామాల ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.