గిరిజన గ్రామాల అభివృద్ధికి రూ.826.48 కోట్లు
ABN , Publish Date - Oct 08 , 2025 | 12:19 AM
ఏజెన్సీ ప్రాంతాల్లో కొండరెడ్డి గిరిజన గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు సాగుతు న్నాయి.
గిరిజన గ్రామాల అభివృద్ధికి
రూ.826.48 కోట్లు
అంచనాలు రూపొందించిన అధికారులు
మారనున్న గిరిజన గ్రామాల రూపురేఖలు
9 మండలాలు, 46 గ్రామాల్లో ముగిసిన గ్రామసభలు
మౌలిక సదుపాయాలతో ప్రభుత్వానికి నివేదికలు
బుట్టాయగూడెం, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): ఏజెన్సీ ప్రాంతాల్లో కొండరెడ్డి గిరిజన గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు సాగుతు న్నాయి. గిరిజనాభివృద్ధిలో భాగంగా ఆది కర్మయోగి పరివార్ అభియాన్ పథకానికి శ్రీకారం చుట్టాయి. 9 మండలాల్లో 46 కొండరెడ్డి గిరిజన గ్రామాల అభివృద్ధికి రూ.826.48 కోట్లతో అధికారులు అంచనాలు రూపొందించి కేంద్రానికి నివేదించారు. త్వరలో నిధులు కూడా విడుదల కానున్నాయని సమాచారం. పశ్చిమ ఏజెన్సీ బుట్టాయగూడెం మండలంలోని 19 గ్రామాల్లో అభివృద్ధి పనులకు రూ.326.43 కోట్లు, వేలేరుపాడు మండలంలో 9 గ్రామాలకు రూ.123.15 కోట్లు, పోలవరంలో 5 గ్రామాలకు రూ.141.11 కోట్లు, జీలుగుమిల్లి 5 గ్రామాల కు రూ.54.15 కోట్లు, కుక్కునూరు 2 గ్రామాలకు రూ.3.53 కోట్లు, టి.నరసాపురంలో 1 గ్రామానికి రూ.17.92 కోట్లు, చాట్రాయిలో 1 గ్రామానికి రూ.43.30 కోట్లు, నూజివీ డులో 2 గ్రామాలకు రూ.93.31 కోట్లు, చింతలపూడి మండలంలో 2 గ్రామాల్లో అభివృద్ధి పనులకు రూ.17.55 కోట్లతో అంచనాలు సిద్ధం చేశారు. మొత్తం 9 మండలాల్లోని 48 గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను పూర్తిచేయాలని లక్ష్యంతో నెల రోజులపాటు గ్రామాల్లో గ్రామసభ లు నిర్వహించి ప్రజల భాగస్వామ్యంతో సమస్యలను గుర్తించారు. ప్రతి గ్రామంలో రహదారులు, మంచినీరు, మరుగుదొడ్లు, విద్యుత్ కల్పన, గృహాల నిర్మాణం, చిన్న పరిశ్రమలు ఏర్పాటుకు సహాయం, యువతకు ఉపాధి, ఉద్యోగ అవ కాశాలు, వ్యవసాయ అనుబంధ రంగాల బలోపేతం, యూనిట్లు పంపిణీ, సామాజిక పింఛన్లు, శాంతిభద్రతలు తదితర అభివృద్ధి కార్యక్రమాలతో కూడిన గ్రామాల వారీగా విజన్ యాక్షన్ ప్లాన్ రూపొందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అక్టోబరు 2తో గ్రామసభలు ముగియడంతో గిరిజనుల నుంచి క్షేత్రస్థాయిలో వచ్చిన సమస్యలు, అవసరాలతో గ్రామస భల ఆమోదంతో రూ.826.48 కోట్లతో అంచనాలు సిద్ధం చేసి అధికారులు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖకు పంపారు. పరిశీలన తర్వాత నిధులు విడుదల కానున్నాయని అధికారులు తెలిపారు. గిరిజన గ్రామాల్లో అభి వృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ఖాయమని అందరూ భావిస్తున్నారు.