Share News

మన్యం బంద్‌ విజయవంతం

ABN , Publish Date - Dec 23 , 2025 | 12:51 AM

పోలవరం–రంపచోడవరం నూతన జిల్లాలో పోలవరం నియో జక వర్గాన్ని కలపాలని కోరుతూ జిల్లా సాధన కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా సోమవారం జరిగిన మన్యం బంద్‌ విజయవంతమైంది.

మన్యం బంద్‌ విజయవంతం
బుట్టాయగూడెం బస్టాండ్‌ సెంటరులో రాస్తారోకో చేస్తున్న గిరిజనులు

బుట్టాయగూడెం/కుక్కునూరు/వేలేరుపాడు/పోలవరం, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి):పోలవరం–రంపచోడవరం నూతన జిల్లాలో పోలవరం నియో జక వర్గాన్ని కలపాలని కోరుతూ జిల్లా సాధన కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా సోమవారం జరిగిన మన్యం బంద్‌ విజయవంతమైంది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు మూతపడగా పాఠశాలలు, కళాశాలలు, పెట్రోల్‌ బంకులు, షాపులు వ్యాపార సముదాయాలు, దుకాణాలను ఆందోళనకారులు మూయించి వేశారు. బుట్టాయగూడెం బస్టాండ్‌ సెంటరులో రాస్తారోకో నిర్వహించారు. కుక్కునూరులో ర్యాలీ నిర్వహించారు. వేలేరుపాడులో పోలవరం సాధన కమిటీ ఆధ్వర్యంలో వేలేరుపాడు నుంచి రెడ్డిగూడెం క్రాస్‌రోడ్డు వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్‌ సెంటర్‌ వద్ద నిరసన తెలిపారు. పోలవరం మండల కేంద్రంలో షాపులు బంద్‌ చేయించి ఏటిగట్టు సెంటర్‌లో నిరసన వ్యక్తం చేశారు.

Updated Date - Dec 23 , 2025 | 12:51 AM