Share News

75 ఏళ్ల తర్వాత అలంపురంలో జాతర

ABN , Publish Date - Dec 22 , 2025 | 12:35 AM

పెంటపాడు మండలం అలంపురం గ్రామ దేవత ముళ్లమ్మతల్లి జాతర సోమవారం నుంచి ప్రారంభం కానున్నది.

75 ఏళ్ల తర్వాత అలంపురంలో జాతర
ముళ్లమ్మ తల్లి

తాడేపల్లిగూడెం రూరల్‌, డిసెంబరు 21 (ఆంధ్ర జ్యోతి): పెంటపాడు మండలం అలంపురం గ్రామ దేవత ముళ్లమ్మతల్లి జాతర సోమవారం నుంచి ప్రారంభం కానున్నది. సుమారు 75 ఏళ్ల క్రితం జరిగిన జాతర చూసేందుకు గ్రామస్తులు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఆ తరంలో జాతర చూసిన వారి వేళ్లతో లెక్క పెట్టవచ్చంటే ఈ జాతర గ్రామస్థులకు ఎంత ప్రత్యేకమో చెప్పనవ సరం లేదు. ఈనెల 22న అమ్మవారి గుడిసె రాట పాతే కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభం కాను న్నాయి. జనవరి 1న మలిసేవ, 8న జాతర సేవ, 10న బలిచేట, 11న నైవేద్యాలు నిరహించేందుకు జాతర కమిటీ ఏర్పాట్లు చేశారు. గ్రామం మొత్తం విద్యుత్‌లైట్లు, అమ్మవారి కటౌట్‌లతో అలంక రించారు. జిల్లా నలుమూలల నుంచే కాక ఇతర దేశాలలో స్థిరపడినవారంతా గ్రామానికి రాను న్నారు. అమ్మవారి పుట్టింటి నుంచి గోరింట వారు అమ్మవారిని పూరిగుడిసెలో అంగరంగ వైభవంగా తీసుకొచ్చే కార్యక్రమం చేపట్టనున్నారు. అత్తింటి నుంచి మారరేపల్లి వారు మెట్టినింటికి తీసుకు రానున్నారు. జాతర అంగరంగ వైభవంగా చేపట్టనున్నట్టు కమిటీ సభ్యులు తెలిపారు.

Updated Date - Dec 22 , 2025 | 12:35 AM