ఎన్నాళ్లకెన్నాళ్లకు..!
ABN , Publish Date - Sep 20 , 2025 | 12:42 AM
మండలంలోని కాట్రేనిపాడుకు 30 ఏళ్ల తర్వాత రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారఽథి సహకారం కృషితో సాగర్ జలాలు ఎట్టకేలకు వచ్చా యి.
కాట్రేనిపాడుకు వస్తున్న సాగర్ జలాలను పరిశీలిస్తున్న చైర్మన్ బాలకృష్ణ, తదితరులు
ముసునూరు, సెప్టెంబరు 19 (ఆంధ్ర జ్యోతి):మండలంలోని కాట్రేనిపాడుకు 30 ఏళ్ల తర్వాత రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారఽథి సహకారం కృషితో సాగర్ జలాలు ఎట్టకేలకు వచ్చా యి. గ్రామానికి వస్తున్న సాగర్ జలాలను డీసీ చైర్మన్ రాపర్ల బాలకృష్ణ పరిశీలించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేంపాడు మేజర్ కాలువ నుంచి కాట్రేని పాడుకు నీరు వచ్చే మైనర్ కాలువలో సుమారు 300 మీటర్లు కాలువ తవ్వకం ఒక రైతు అడ్డుకోవడం వల్ల ఆగిపోయింద న్నారు. దీంతో ఏళ్ల తరబడి కాట్రేనిపాడు చెరువులకు సాగర్ జలాలు నిలిచిపోయా యన్నారు. ఈ సమస్యను స్థానిక టీడీపీ నాయకులు, రైతులు, మంత్రి పార్థసారథి దృష్టికి తీసుకెళ్లగా ప్రస్తుతం 300 మీటర్ల కాలువ తవ్వకం సాధ్యపడదని, ప్రత్యామ్నా యంగా వేంపాడు మేజర్ కాలువ నుంచి జంగంగూడెం అడవి మీదుగా కాట్రేని పాడు మైనర్ కాలువకు కలిపేలా తాత్కా లికంగా కాలువను ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించి కాలువ తవ్వకానికి అవసరమైన నగదును సమ కూర్చినట్టు తెలిపారు. సుమారు రూ.లక్షా 50 వేలతో కాట్రేనిపాడు మైనర్ కాలువకు కలిపేలా తాత్కాలిక కాలువను ఏర్పాటు చేసేందుకు టీడీపీ నాయకులు బొమ్మగంటి శ్యామలరావు, గద్దల మోహన్‌రావు, సూర్య దేవర శ్రీనివాసరావు, బడిపాటి సాంబయ్య, రాపర్ల ప్రతాప్‌లతో పాటు రైతులు కృషి చేశారన్నారు. దీంతో 30 ఏళ్ల తర్వాత కాట్రేనిపాడు చెరువులకు సాగర్ జలాలు వచ్చాయని చైర్మన్ తెలిపారు.