Share News

లెక్క సరి చేస్తారా?

ABN , Publish Date - Oct 31 , 2025 | 01:08 AM

పరిపాలనా సౌలభ్యం, ప్రజాభీష్టం మేరకు రెవెన్యూ డివిజన్ల పరిధిలో పూర్తి నియోజక వర్గాలు ఉండేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జిల్లాల పునర్విభజనతోపాటు రెవెన్యూ డివి జన్లను ఒక కొలిక్కే తెచ్చే ప్రయత్నం జరు గుతోంది.

 లెక్క సరి చేస్తారా?

నియోజకవర్గమంతా ఒకే రెవెన్యూ డివిజన్‌ పరిధిలోకి..

చింతలపూడి చింత తీరేనా..

ద్వారకాతిరుమల, గణపవరంలు ఏలూరు డివిజన్‌కే..

తెరపైకి పాత ఏలూరు రెవెన్యూ డివిజన్‌

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

పరిపాలనా సౌలభ్యం, ప్రజాభీష్టం మేరకు రెవెన్యూ డివిజన్ల పరిధిలో పూర్తి నియోజక వర్గాలు ఉండేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జిల్లాల పునర్విభజనతోపాటు రెవెన్యూ డివి జన్లను ఒక కొలిక్కే తెచ్చే ప్రయత్నం జరు గుతోంది. జిల్లాల పునర్విభజన, రెవెన్యూ సబ్‌ డివిజన్‌ కార్యాలయాల ఏర్పాటులో కొన్ని మండలాలను ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా వైసీపీ ప్రభుత్వం రెవెన్యూ డివిజన్‌లను మార్చేసింది. ఈ లెక్కలను సరిచేసే దిశగా కూటమి ప్రభుత్వం రెవెన్యూ డివిజన్‌ పరిధిలో పూర్తి నియోజకవర్గం చేర్చేలా ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది. అధికారులు నుంచి ప్రతిపాదనలు వెళ్లాయి. అంతా సవ్యంగా జరిగితే నవంబరు 10న జరిగే కేబి నెట్‌ సమావేశంలో లెక్కలు సరిచేసే అవకాశం ఉంది. ఏలూరు జిల్లాలో ఏలూరు, నూజివీడు, జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్లు, 27 మండలాలు వున్నాయి. ఏలూరు డివిజన్‌లో కైకలూరు, ఏలూరు, దెందులూరు నియోజక వర్గాలతోపాటు ఉంగుటూరులోని గణపవరం మినహా మూడు మండలాలు కలిపి మొత్తం 11 మండలాలు పూర్తిగా ఉన్నాయి. జంగా రెడ్డిగూడెం డివిజన్‌లో పోలవరం నియోజక వర్గం, చింతలపూడి నియోజకవర్గంలోని కామవరపుకోట, జంగారెడ్డిగూడెం, గోపాలపురం నియోజకవర్గంలోని ద్వారకాతిరుమల మండలంతో కలిపి 10 మండలాలు వున్నాయి. నూజివీడు సబ్‌ కలెక్టరేట్‌లో నూజివీడు నియోజకవర్గంతోపాటు, చింతలపూడిలోని చింతలపూడి, లింగపాలెం కలిసి మొత్తం ఆరు మండలాలు ఉన్నాయి. నూజివీడును ఎన్టీఆర్‌ జిల్లాలోకి, కైకలూరును కృష్ణా జిల్లాలోకి మార్చాలనే డిమాండ్‌ వుంది. దాదాపు ఇది కొలిక్కి వస్తోందని ప్రజా ప్రతినిధులు, అధికారులు చెబుతున్నారు. అదే జరిగితే గోపాలపురం నియోజకవర్గం పూర్తిగా ఏలూరు జిల్లాలోకి వస్తుందంటున్నారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో వున్న గణపవరాన్ని తిరిగి ఏలూరు జిల్లాలోకి మారుస్తారు. అప్పుడు ఏలూరు జిల్లాలో రెండే డివిజన్‌లు వుంటాయని భావిస్తున్నారు. దీనిపై పూర్తి స్పష్టత రావాల్సి వుంది.

Updated Date - Oct 31 , 2025 | 01:08 AM