బ్రెయిన్ స్ర్టోక్ వస్తేయాక్సిడెంట్ సర్టిఫికెట్
ABN , Publish Date - Nov 22 , 2025 | 12:52 AM
తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన బర్నికల సత్యనారాయణ వయసు 40 ఏళ్లు. నాలుగేళ్ల క్రితం బ్రెయిన్ స్ర్టోక్ వచ్చి మెదడులో నరా లు కట్ అయ్యాయి.
టీడీపీ ఇన్‌ఛార్జ్ బాబ్జికి సత్యనారాయణ వినతి
భీమవరం, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన బర్నికల సత్యనారాయణ వయసు 40 ఏళ్లు. నాలుగేళ్ల క్రితం బ్రెయిన్ స్ర్టోక్ వచ్చి మెదడులో నరా లు కట్ అయ్యాయి. కుడి కన్ను కనిపించదు. ఎడమ చేయి, కాలు పనిచేయదు. మాట్లాడితే చేయి వణుకుతుంది. అప్పుడు కుడి చేత్తో దానిని పట్టుకోవాలి. అతనికి బెడ్ రీడెన్ పెన్షన్ మంజూరుచేయాలి. కాని, వైద్యులు సదరం సర్టిఫికెట్‌లో ఏం రాశారో తెలుసా ? బ్రెయిన్ స్ర్టోక్‌కు బదులు యాక్సిడెంట్ అని నమోదుచేశారు. దీని ఫలితం.. ఆయనకు పెన్షన్ మంజూరు కాలేదు. ఒక వైద్యుడు అయితే రూ.30 వేలు డిమాండ్ చేశారట !. మూడుసార్లు సదరం సర్టిఫికె ట్‌లో బ్రెయిన్ స్ర్టోక్‌తో పక్షవాతం వచ్చిందంటూ నమోదు చేసుకో వడానికి వెళితే రెండేళ్లు ఆగాలంటూ చెప్పుకొచ్చారు. ఈసారి వెళితే ఇప్పటికే మూడుసార్లు ఆధార్ నమోదు అయిపోయిందని చెబుతున్నారు. కొత్తగా ఆధార్ తీసుకోవడం లేదని తేల్చేశారు. పెన్షన్‌కు సత్యనారా యణ పూర్తిగా అనర్హుడయ్యారు. అతనికి ఇద్దరు కుమార్తె లు. పెద్ద కుమార్తె 6, చిన్న కుమార్తె మూడో తరగతి చదువుతున్నారు. ఉపాధి లేదు. స్పందనలోనూ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. తాడేపల్లిగూడెంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వలవల బాబ్జి శుక్రవారం నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌లో సత్యనారాయణ తన బాధను ఆయనకు వివరించారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇలాంటి వారి విషయంలో వైద్యులు ఎందుకు నిరంకుశంగా వ్యవహరిస్తారోనని పలువురు వాపోయారు.