Share News

జిల్లాలో 94.26శాతం పింఛన్ల పంపిణీ

ABN , Publish Date - Jul 02 , 2025 | 12:25 AM

జిల్లాలో ఎన్‌టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ 94.26 శాతం పూర్తయింది.

జిల్లాలో 94.26శాతం పింఛన్ల పంపిణీ
ఆలమూరులో పింఛన్‌ అందజేస్తున్న కలెక్టర్‌ నాగరాణి

భీమవరం టౌన్‌, జూలై 1(ఆంద్రజ్యోతి): జిల్లాలో ఎన్‌టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ 94.26 శాతం పూర్తయింది. జిల్లాలో 62,81,768 లబ్ధిదారులకు మంగళవారం సాయంత్రానికి 59,27,885 మందికి రూ.25,50,85,195 అందించారు. ఉదయం 7 గంటల నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. మిగిలిన వారికి బుధవారం కూడా పెన్షన్‌ల పంపిణీ జరుగుతుంది. పట్టణాల్లో మునిసిపల్‌ అధికారులు, మండలాల్లో ఎంపీడీవోలు పర్యవేక్షించారు.

స్వయంగా పింఛన్లు అందించిన కలెక్టర్‌

పెనుమంట్ర, జూలై 1 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఆలమూరు ఇందిరమ్మ కాలనీలో పింఛన్‌ లబ్ధిదారులకు కలెక్టర్‌ నాగరాణి మం గళవారం స్వయంగా పింఛన్లు అందజేశారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్‌ సొమ్ము అందజేసి వారి యోగ క్షేమాలను, ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెల సచివాలయ సిబ్బంది ఇంటి వద్దకే వచ్చి పంపిణీ చేస్తున్నారా అని ఆరా తీశారు. కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ వై.రవికుమార్‌, ఎంపీడీవో జీఎస్‌.ప్రభాకర్‌రావు, సర్పంచ్‌ మేడపరెడ్డి వెంకటరమణ, పితాని వెంకట సురేష్‌, పంచాయతీ కార్య దర్శి ఎం.సుధారాణి, ఎంపీటీసీ పలివెల ఆశాలత పాల్గొన్నారు.

Updated Date - Jul 02 , 2025 | 12:25 AM