Share News

చుక్కల మందుకు చక్కని స్పందన

ABN , Publish Date - Dec 22 , 2025 | 12:06 AM

పోలియో నివారణకు జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారులకు ఆదివారం నిర్వహించిన చుక్కల మందు కార్యక్రమం విజయవంతమైంది.

చుక్కల మందుకు చక్కని స్పందన
ఏలూరులో చిన్నారికి పోలియో చుక్కలు వేస్తున్న కలెక్టర్‌ వెట్రిసెల్వి

93 శాతం పూర్తి

జిల్లాలో ఐదేళ్లలోపు పిల్లలు 2,00,008 మంది

1709 బూత్‌లలో పల్స్‌పోలియో

నేడు, రేపు ఇంటింటికీ పంపిణీ

నూరు శాతం లక్ష్య సాధనకు చర్యలు : జిల్లా వైద్యాధికారి

ఏలూరు అర్బన్‌, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): పోలియో నివారణకు జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారులకు ఆదివారం నిర్వహించిన చుక్కల మందు కార్యక్రమం విజయవంతమైంది. జిల్లా లో మొత్తం 2,00,008 మంది పిల్లలకు వ్యాక్సిన్‌ వేయాల్సి ఉంది. జిల్లాలో 93 శాతం మందికి పోలియో చుక్కలు వేసినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ పీజే.అమృతం తెలిపారు. చుక్కల మందు పంపిణీ నిమిత్తం మొత్తం 1709 బూత్‌లను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచే వ్యాక్సినేషన్‌ పంపినీ వైద్య సిబ్బంది ముమ్మరం చేశారు. ముఖ్యంగా హైరిస్క్‌ ప్రాంతాలుగా గుర్తించిన సంచార జాతుల కుటుంబాలు, మురి కివాడలు, చేపలచెర్వులు, ఏజెన్సీ మారు మూల గ్రామాల్లో నూరుశాతం వ్యాక్సినేషన్‌ జరిగేలా మైబైల్‌ టీమ్‌లను క్షేత్రస్థాయికే పంపి చిన్నారు లకు చుక్కలమందు వేశారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రార్థనామందిరాలు, ముఖ్య కూడళ్లలో ప్రత్యేక బృందాలను నియమించారు. కలెక్టర్‌ వెట్రిసెల్వి ఏలూరులోని గ్జేవియర్‌ నగర్‌ ఫిరం గులదిబ్బలో ఏర్పాటుచేసిన బూత్‌లో చిన్న పిల్లలకు వ్యాక్సిన్‌ వేయగా, ఎమ్మెల్యేలు చింత మనేని ప్రభాకర్‌, బడేటి చంటి, డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌, బాలరాజు, తదితరులు చిన్నారులకు చుక్కల మందువేశారు. ఆదివారం చుక్కల మందు వేయించుకోని పిల్లలను గుర్తించేందుకు సోమ, మంగళవారాల్లో ఇంటింటికీవెళ్లి వ్యాక్సిన్‌ వేసేందుకు గ్రామ/వార్డు సచివాలయాల వారీగా ఏఎన్‌ఎం, అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు, నర్సింగ్‌ విద్యార్థినులతో కూడిన బృందాలను నియమించినట్టు డీఎంహెచ్‌వో వివరించారు.

Updated Date - Dec 22 , 2025 | 12:06 AM