Share News

90 శాతం రేషన్‌ పంపిణీ

ABN , Publish Date - Sep 15 , 2025 | 12:07 AM

సెప్టెంబరు నెలకు సంబంధించి రేషన్‌ సరుకుల పంపిణీకి చివరి తేదీ 15వతేదీ సోమవారంతో ముగుస్తుంది.

90 శాతం రేషన్‌ పంపిణీ

జిల్లాలో 5 లక్షల 57 వేల 79 కార్డులు

రేషన్‌ తీసుకున్నవారు 4 లక్షల 97 వేలు

ఇంకా తీసుకోవలసినవారు 59 వేలు

ఉండి, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): సెప్టెంబరు నెలకు సంబంధించి రేషన్‌ సరుకుల పంపిణీకి చివరి తేదీ 15వతేదీ సోమవారంతో ముగుస్తుంది. ఆదివారం సాయంత్రం నాటికి జిల్లాలో సుమారుగా 90 శాతం పంపిణీ పూర్తయినట్టు సివిల్‌ సప్లయిస్‌ అధికారులు తెలిపారు. ఇంకా 56 వేల మంది లబ్ధిదారులు తీసుకోవలసి ఉంది. సివిల్‌సప్లయిస్‌ అధికారులు రేషన్‌ డీలర్లును అప్రమత్తం చేశారు. జిల్లాలో రేషన్‌కార్డుదారులకు ఉచితంగా బియ్యం, పంచదార అరకిల్లో రు.17 లకు అందిస్తున్నది. జిల్లావ్యాప్తంగా 5 లక్షల 57 వేల 79 మంది కార్డుదారులు ఉండగా ఆదివారం సాయంత్రానికి 4 లక్షల 97 వేల 500 మంది రేషన్‌ సరుకులు తీసుకున్నారు. ఇంకా 59 వేల 579 మంది తీసుకోవలసి వున్నట్లు సివిల్‌ సప్లయిస్‌ అధికారులు చెబుతున్నారు. సోమవారం చివరిరోజు కావడంతో డీలర్లు అంతా ఉదయమే దుకాణాలను తెరిచి రేషన్‌ అందించాలని అధికారులు సూచిస్తున్నారు. ఒక పక్క రేషన్‌ పంపిణీ, మరొ పక్క కొత్తకార్డులు అంద జేయడంపై డీలర్లను అధికారులు అభినందించారు.

డీలర్లకు కొత్త ఈ–పోస్‌ యంత్రాలు

భీమవరం టౌన్‌, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి) : రేషన్‌కార్డు దారులకు వేగవంతంగా రేషన్‌ బియ్యం, పంచదార వంటివస్తువులను అందించేందుకు డీలర్లకు కొత్త ఈ– పాస్‌ యంత్రాలను అందించారు. జిల్లాలో మొత్తం 1052 రేషన్‌ షాపులు ఉండగా వాటి అన్నింటికి ఈ పాస్‌యంత్రాలు పౌరసరఫరాల శాఖకు అందాయి. దీంతో గత రెండు రోజులుగా యంత్రా లను మండలలా వారీగా డిలర్స్‌ను రప్పించి అందిస్తున్నారు. గత ఈ–పాస్‌ యంత్రాలు 2జితోను బటన్‌ సిస్టంతో పనిచేసేవి. దీనివల్ల సిగ్నల్‌ సరిగ్గా లేకపోవటం, అంకెలు పడకపోవటం, మిషన్‌లు ఇచ్చి చాలా కాలం అవ్వటం వల్ల ఇబ్బందులు రావటంతో వాటి స్ధానంలో కొత్త టెక్నాలజీ మిషన్‌లు అందుబాటులోకి తీసుకువచ్చారు. 5జీ నెట్‌తో కూడి, టచ్‌ స్ర్కీన్‌తో ఉండే ఈ మిషన్‌లు డీలర్స్‌కు అందించారు. దీనివల్ల సిగ్నల్‌ పూర్తిస్ధాయిలో అందటంతోపాటు వేగంగా పని చేస్తుందని అధికారులు తెలిపారు. మిషన్‌ తీసుకున్న గంట తరువాత వినియోగంలోకి తీసుకోవచ్చునని తెలిపారు. మండలలా వారీగా కార్డు దారుల వివరాలను నమోదు చేసి వారికి అందిస్తున్నామని తెలిపారు. మరో 5 మండలాలకు సంబందించి మిషన్‌లు అందిస్తే నూరుశాతం పంపిణీ పూర్తి అవుతుందని తెలిపారు. 15వ తేది సోమవారం రేషన్‌ ఇచ్చేందుకు ఆఖరు కావటంతో మిగిలిన డీలర్స్‌కు మంగళవారం అందించనున్నారు.

Updated Date - Sep 15 , 2025 | 12:07 AM