641.5 కిలోల గంజాయి ధ్వంసం
ABN , Publish Date - Jul 10 , 2025 | 12:08 AM
జిల్లాలో పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయిని గుంటూ రు తరలించి ధ్వంసం చేశారు.
జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలో 64 కేసులలో స్వాధీనం
బందోబస్తు నడుమ గుంటూరు తరలింపు
భీమవరం క్రైం, జూలై 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయిని గుంటూ రు తరలించి ధ్వంసం చేశారు. జిల్లాలోని 23 పోలీస్ స్టేషన్ల పరిధిలో 64 కేసులలో 641.544 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా కొండవీడుకు మంగళవారం తరలించారు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, ఏఎస్పీ వి.భీమారావు, నరసాపురం డీఎస్పీ జి.శ్రీవేద సభ్యులుగా ఉన్న ‘డ్రగ్ డిస్పోజల్ కమిటీ’, మధ్యవర్తుల ఆధ్వర్యంలో బుధవారం గంజాయి ధ్వంసం చేశారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో మధ్యవర్తుల సమక్షంలో కేసుల వారీగా గంజా యి తూకం వేసి పరిశీలించారు. మొత్తం 64 కేసులలో 641.544 కిలోల గంజాయిని ప్రత్యేక కవర్లు, సం చులలో పెట్టి, వాటికి లక్క సీలు వేశారు. గంజాయి సంచులను పోలీసు బందోబస్తు నడుమ గుంటూరు తరలించారు. కొండవీడు పరిధిలోని జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ మొదటి బాయిలర్‌లో వేసి ధ్వంసం చేశారు. ఈ మొత్తం ప్రక్రియను వీడియో, ఫొటోగ్రఫీ ద్వారా నమోదు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రెయినీ డీఎస్పీ కె.మానస, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ వి.పుల్లారావు, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ దేశంశెట్టి వెంకటేశ్వరరావు, భీమవరం ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ కె.బాలరాజు, మధ్యవర్తులు పాల్గొన్నారు.