Share News

480 ఫోన్ల రికవరీ.. బాధితులకు అందజేత

ABN , Publish Date - Jul 30 , 2025 | 12:21 AM

దొంగిలించిన వస్తువులను కొనడం, అమ్మడం, దాచి పెట్టడం చట్టరీత్యా నేరమని ఈవిధమైన నేరాలకు పాల్పడితే మూడేళ్ల వరకు జైలు శిక్షకు గురవుతారని జిల్లా ఎస్పీ కేపీఎస్‌ కిశోర్‌ హెచ్చరించారు.

480 ఫోన్ల రికవరీ.. బాధితులకు అందజేత
బాధితురాలికి సెల్‌ఫోన్‌ అందిస్తున్న ఏలూరు జిల్లా ఎస్పీ కిశోర్‌

దొంగ వస్తువులు కొన్నా, అమ్మినా, దాచిపెట్టినా మూడేళ్ల జైలు శిక్ష : ఏలూరు జిల్లా ఎస్పీ కిశోర్‌

ఏలూరు క్రైం, జూలై29(ఆంధ్రజ్యోతి):దొంగిలించిన వస్తువులను కొనడం, అమ్మడం, దాచి పెట్టడం చట్టరీత్యా నేరమని ఈవిధమైన నేరాలకు పాల్పడితే మూడేళ్ల వరకు జైలు శిక్షకు గురవుతారని జిల్లా ఎస్పీ కేపీఎస్‌ కిశోర్‌ హెచ్చరించారు. జిల్లాలో సెంట్రల్‌ ఎక్యూప్‌మెంట్‌ ఐడెంటీ రిజిస్టర్‌ (సీఈఐఆర్‌) ద్వారా స్వాధీనం చేసుకున్న మొబైల్స్‌ను మంగళవారం ఏలూరు సురేష్‌చంద్ర బహుగుణ పోలీస్‌ కల్యాణ మండపంలో బాధితులకు ఆయన అందించి మాట్లాడారు. జిల్లాలో ఇప్పటివరకు 15 దఫాలుగా సెల్‌ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించామని, 16వ సారి 57లక్షల 60 వేల రూపాయల విలువైన 480 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందిస్తున్నామన్నారు. ఇప్పటివరకు 3,456 ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని వీటి విలువ 5 కోట్ల 33 లక్షల 35 వేల 684 రూపాయలు అని అన్నారు. వీటిని ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్‌, అంబేడ్కర్‌ కోనసీమ, కృష్ణా, తూర్పు గోదావరి, విజయనగరం, తూర్పుగోదావరి, విశాఖపట్టణం జిల్లాలో, తెలం గాణ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రస్తుతం వినియో గదారుల వద్ద ఈ ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రతి మొబైల్‌ ఫోన్‌కు ప్రత్యేకంగా ఐఎంఈఐ నంబరు ఉంటుందని దానిని భద్రపరుచుకోవాలన్నారు. ఎవరైనా దొంగ ఫోన్లను కొన్నా, విక్రయించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎన్‌. సూర్యచం ద్రరావు, ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్‌, సీసీఎస్‌ సీఐ వెంకటేశ్వరరావు, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ మల్లేశ్వరరావు, త్రీటౌన్‌ సీఐ వి.కోటేశ్వరరావు, వన్‌టౌన్‌ సీఐ జి.సత్యనారాయణ పలువురు పాల్గొన్నారు.

Updated Date - Jul 30 , 2025 | 12:21 AM